వీడియో: 'వైల్డ్ డాగ్' వేట సాగిందిలా..!

Update: 2021-03-30 12:16 GMT
'కింగ్' అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న తాజా చిత్రం ''వైల్డ్ డాగ్''. యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకొని దర్శకుడు అహిషోర్ సాల్మన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో నాగ్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో కనిపిస్తున్నాడు. 'యూ/ఏ' సెన్సార్ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం ఏప్రిల్ 2న గ్రాండ్‌ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్ - ట్రైలర్ విశేష స్పందన తెచ్చుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో 'వైల్డ్ డాగ్' హంట్ వెనుక కథను వివరిస్తూ చిత్ర యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది.

హైదరాబాద్ ‏లో జరిగిన గోకుల్ చాట్ - లుంబిని పార్క్ జంట బాంబు దాడుల నేపథ్యంలో పుట్టుకొచ్చిందే ఈ వైల్డ్ డాగ్ అని.. ఇందులో నాగార్జున పోషించిన విజయ్ వర్మ టెర్రరిస్టులను అరెస్ట్ చేయడం లాంటివి బిలీవ్ చేయడు.. వాళ్ళని చంపేయడమే కరెక్ట్ అని భావిస్తుంటాడు.. అందుకే అతన్ని వైల్డ్ డాగ్ అని పిలుస్తారు అని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇందులో యాక్షన్ రెగ్యులర్ తెలుగు సినిమాలో ఉన్నట్లు ఉండకూడదని హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ డేవిడ్ ని తీసుకొచ్చామని.. అయితే కోవిడ్ పరిస్థితుల్లో అతను ఇండియాకి రావడం కుదరకపోవడంతో మిగతా యాక్షన్ సన్నివేశాలను శ్యామ్ కౌశల్ లో చేశామని తెలిపారు. అలానే త్వరగా క్వాలిటీ ఔట్ ఫుట్ కావాలని షానెల్ డియో ని సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నామని.. కష్టమైన షాట్స్ ని కూడా అద్భుతంగా షూట్ చేసారని చెప్పారు. మనాలి - నేపాల్ - రోహటంగ్ కనుమలలో బ్లడ్ ప్రెసర్ పడిపోయే పరిస్థితుల్లో కూడా ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించామని నాగార్జున చెప్పుకొచ్చారు.

'వైల్డ్ డాగ్' చిత్రంలో నాగార్జునకు జోడీగా బాలీవుడ్ భామ దియామీర్జా నటించింది. సయామీ కేర్ - అతుల్ కులకర్ణి - ఆలీ రెజా - ప్రకాష్ సుదర్శన్ - బిలాల్ హుస్సేన్ - ఆర్యా పండిట్‌ - కాలెబ్‌ మాథ్యూస్‌ ఇతర పాత్రలు పోషించారు. థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూర్చారు. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ వర్క్ చేయగా.. మురళి ఎస్వీ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. నాగార్జున కెరీర్ లో మరో వైవిధ్యమైన సినిమాగా వస్తున్న ''వైల్డ్ డాగ్'' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Full View
Tags:    

Similar News