ట్రెండీ టాక్: 'ఆదిపురుష్ 3డి'కి జాతీయ అవార్డ్?

Update: 2022-07-23 03:37 GMT
68వ జాతీయ అవార్డుల విజేతలను ఈ శుక్రవారం ప్రకటించారు. సూర్య 'సూరరై పొట్రు' ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా నిల‌వ‌గా.. ఈ చిత్రంలో న‌ట‌న‌కు ఉత్తమ నటుడిగా సూర్య అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటి స‌హా ఐదు జాతీయ అవార్డులను ఈ సినిమా గెలుచుకుంది. అజయ్ దేవ్ గన్  'తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్' లో న‌ట‌న‌కు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగా ఈ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు ద‌క్కాయి. సంపూర్ణ వినోదం - ఉత్తమ కాస్ట్యూమ్ అందించిన ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఇది నిలిచింది. ఈసారి ద‌మ్మున్న సినిమాల‌న్నిటికీ స్వ‌చ్ఛందంగా జాతీయ అవార్డులు ద‌క్కాయి.

ఈ విజయాన్ని పురస్కరించుకుని కాజోల్ తాను త‌న‌ భర్త అజయ్ తో కలిసి ఉన్న తెరవెనుక ఫోటోను షేర్ చేస్తూ ''టీమ్ తాన్హాజీ 3 జాతీయ అవార్డులను గెలుచుకుంది. చాలా సంతోషంగా గర్వంగా ఉంది! ఉత్తమ నటుడుగా అజ‌య్ దేవ‌గ‌న్ పేరు నిల‌వ‌డం ఆనందాన్నిచ్చింది'' అని అన్నారు. అజయ్ తన కెరీర్ లో మూడవ జాతీయ అవార్డును గెలుచుకున్నందుకు అభిమానులకు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపాడు. పృథ్వీరాజ్- కీర్తి సురేష్ వంటి ప్రముఖులు విజేతలకు అభినందన సందేశాలను కురిపిస్తున్నారు.

ఆస‌క్తిక‌రంగా 'తానాజీ 3డి' చిత్రం వెన‌క ఉన్న‌ది మాత్రం ఓంరౌత్. ద‌ర్శ‌కుడిగా ఈ సినిమాని మ‌రో లెవ‌ల్లో తెర‌కెక్కించాడు. అత‌డి అస‌మాన ప్ర‌తిభ వ‌ల్ల‌నే తానాజీ కి జాతీయ అవార్డులు ద‌క్కాయ‌న‌డంలో సందేహం లేదు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తున్న 'ఆదిపురుష్ 3డి'కి ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తానాజీకి జాతీయ‌ పుర‌స్కారాలు ద‌క్క‌డం ఆదిపురుష్ 3డికి బిగ్ బూస్ట్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.

ఇక ఆదిపురుష్ ని కూడా ఓంరౌత్ అంతే ప్ర‌త్యేకంగా తెర‌కెక్కిస్తుండ‌డంతో 2023 -24 సీజ‌న్ కి ఆదిపురుష్ కూడా జాతీయ అవార్డుల రేసులో నిల‌వ‌డం ఖాయ‌మ‌న్న అంచ‌నా ఏర్ప‌డింది. నిజానికి ఆ రేంజు స్టాండార్డ్స్ ఉన్న క‌థాంశాన్ని ఎంచుకుని 3డిలో అత‌డు ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. శ్రీ‌రాముడు - రామాయ‌ణం అన్నివేళ‌లా యూనివ‌ర్శ‌ల్. కాబ‌ట్టి ఈ చిత్రం జాతీయ‌ అవార్డుల జూరీ దృష్టిని ఆక‌ర్షించేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నారు.

తానాజీ టీమ్ తో పాటు జాతీయ అవార్డులు అందుకున్న వారికి నెటిజ‌నుల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. సెల‌బ్రిటీలు జోరుగా ట్వీట్లు చేస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా జాతీయ అవార్డుల విజేతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

గొప్ప‌ గుర్తింపు పొందినందుకు జాతీయ చలనచిత్ర అవార్డుల‌ విజేతలందరికీ ముఖ్యంగా ఉత్తమ నటులు సూర్య- అజయ్ దేవగన్- అపర్ణ బాలమురళి- బిజు మీనన్ - నంజియమ్మలకు హృదయపూర్వక అభినందనలు! అలాగే ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్నందుకు ప్రియమైన సచిని గర్వంగా స్మరించుకుంటున్నాను... అని అన్నారు.
Tags:    

Similar News