ఎలాగైనా ఈ ఏడాదే.. గురూజీకి కష్టమే!

Update: 2019-06-24 05:05 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్సకత్వంలో #AA19 షూటింగ్ లో పాల్గొంటున్నాడనే సంగతి తెలిసిందే.  జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందనే విషయంలో మొదటి నుంచి భిన్న కథనాలు వస్తున్నాయి.  ఈ సినిమాను ఈ దసరాకు అని కొందరు.. క్రిస్మస్ సీజన్ అని మరి కొందరు.  వచ్చే ఏడాది సంక్రాంతికి అని కొందరు అంటూ ఉన్నారు. ఈ వార్తల సంగతేమో కానీ స్టైలిష్ స్టార్ మాత్రం ఈ సినిమాను ఎలాగైనా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడట.

బన్నీ లాస్ట్ సినిమా పోయినేడాది సమ్మర్ లో రిలీజ్ అయింది.  ఇప్పటికే ఏడాది దాటింది కదా. దీంతో ఫ్యాన్స్ అందరూ బన్నీ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా తన సినిమా కనీసం ఒక్కటి కూడా రిలీజ్ కుండా 2019 ను ముగించడం బన్నీకి ఏమాత్ర ఇష్టం లేదట. బన్నీ ఇలా అనుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది.  బన్నీ 2003 లో 'గంగోత్రి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రతి ఏడాది బన్నీ నటించిన ఏదో ఒక సినిమా విడుదల అవుతూనే ఉంది.  ఈ ఏడాది మాత్రం మిస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో ఈ సినిమాను ఎలాగైనా నవంబర్ కల్లా పూర్తి చేసి డిసెంబర్ లో విడుదల చేయాలని త్రివిక్రమ్ ను తొందరపెడుతున్నాడట.  

గురూజీ ఏ పనైనా కూల్ గా చేసుకుంటూ పోయే వ్యక్తి. ఆయనకు హడావుడిగా సినిమాను పూర్తి చేసే అలవాటు లేదు. మరి బన్నీ మనసుకు తగ్గట్టు నడుచుకోవాలంటే కాస్త స్పీడ్ పెంచక తప్పదు.  ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫైనలైజ్ చేయలేదు కానీ క్రిస్మస్ కు ముందుగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

    

Tags:    

Similar News