హాలీవుడ్ మూవీ 'అవెంజర్స్ ఎండ్ గేమ్' మూవీ విడుదలకు ముందు అవతార్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అని అంతా అనుకున్నారు. హాలీవుడ్ వర్గాలు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న 3 బిలియన్ డాలర్ల కలెక్షన్స్ ను ఎండ్ గేమ్ దక్కించుకోవడం ఖాయంగా అంతా భావించారు. సినిమాకు ఓపెనింగ్స్ కూడా అదే స్థాయిలో వచ్చాయి. కేవలం ఇండియాలోనే ఈ చిత్రం 400 కోట్ల వరకు రాబట్టింది. అమెరికాతో పాటు ఇంకా పలు దేశాల్లో వందల కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది.
మూడు వారాల్లో టైటానిక్ రికార్డును బ్రేక్ చేసిన ఎండ్ గేమ్ ఆ తర్వాత కలెక్షన్స్ తగ్గడంతో 'అవతార్' రికార్డు సేఫ్ అనుకున్నారు అంతా. కాని చాప కింద నీరు తరహాలో అవెంజర్స్ ఇంకా జోరు కొనసాగిస్తూనే ఉంది. ఆరు వారాలు అయినా కూడా కలెక్షన్స్ నిలకడగా వస్తూనే ఉన్నాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో ఒక మోస్తరుగా వసూళ్లను రాబడుతున్నాయి. ఇప్పటి వరకు ఎండ్ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా 2.71 బిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది. అవతార్ రికార్డును బ్రేక్ చేసేందుకు దాదాపుగా 70 మిలియన్ డాలర్లను వసూళు చేయాల్సి ఉంది. ఈ మొత్తం అవెంజర్స్ కు కష్టం కాదని.. వారం పది రోజుల్లోనే ఆ మొత్తం రాబట్టడం ఖాయం అంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కేవలం అవతార్ రికార్డ్ మాత్రమే కాకుండా చాలా కాలంగా ఊరిస్తూ వస్తున్న 3 బిలియన్ డాలర్ల క్లబ్ లో కూడా ఎండ్ గేమ్ నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొన్ని దేశాల్లో ఈ చిత్రం విడుదలకు సిద్దం చేస్తున్నారు. కొన్ని దేశాల్లో మంచి గ్రాస్ ను రాబడుతూ ఉంది. ఇలాంటి సమయంలో సినిమా ఖచ్చితంగా 3 బిలియన్ డాలర్లను వసూళ్లు చేయవచ్చు అనే నమ్మకం వ్యక్తం అవుతుంది. అవతార్ 2 కే సాధ్యం అనుకున్న 3 బిలియన్ డాలర్లను అవెంజర్స్ సాధించబోతుంది.