తెలుగు సినిమాల్లో తగ్గుతున్న కామెడీ డోస్

Update: 2019-07-09 05:34 GMT
ఒకప్పుడు తెలుగు సినిమా కమర్షియల్ స్టామినాను పెంచుకున్న కాలం అంటే సుమారుగా ఎన్టీఆర్ అడవి రాముడు టైం నుంచి మొదలుపెట్టి చిరంజీవి ఇంద్ర వరకు చూసుకుంటే కామెడీకి ఎంత పెద్ద పీఠ వేసేవారో అర్థమవుతుంది. రాజబాబు-అల్లు రామలింగయ్య - బ్రహ్మానందం-బాబు మోహన్- కోట-ఆలీ- ధర్మవరపు-ఏవీఎస్ ఇలా వీళ్ళ కోసమే ప్రతి సినిమాలోనూ కామెడీ ట్రాక్స్ సెపరేట్ గా ఉండేవి. అసలు కథను ఇవి పక్కదారి పట్టించేలా ఉన్నా అలా అనిపించకుండా దర్శకులు చూపించే నైపుణ్యం ప్రేక్షకులను హ్యాపీగా ఎంజాయ్ చేసేలా ఉండేవి.

అందుకే కమెడియన్లు అతి తక్కువ సమయంలోనే స్టార్లు అయ్యారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ఎంతసేపు హీరో పక్కన ఫ్రెండ్స్ పేరుతో ఉండే గొర్రెల బ్యాచ్ ద్వారా పుట్టించే కామెడీ తప్ప అదే పనిగా నవ్వించడం కోసం ఏ దర్శక రచయితలు ప్రయత్నించడం లేదు. కాలక్రమేణా వీటికి చెల్లుచీటి పాడేసి మెల్లగా హీరో హీరోయిన్లు లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య కామెడీతో సర్దేస్తున్నారు నేటి తరం దర్శకులు. ఆ మధ్య వచ్చిన వినయ విధేయ రామలో దీన్ని గమనించవచ్చు.

ఉన్న ఐదారుగురు కమెడియన్లలో కొందరు హీరో వేషాల మోజులో పడి క్యారెక్టర్ రోల్స్ చేయమని చెప్పడం ఇప్పుడీ పరిస్థితి కారణంగా చెప్పొచ్చు. పోనీ వాళ్ళు అందులోనైనా హాస్యాన్ని పండిస్తున్నారా అంటే అదీ లేదు. అర్థం లేని హీరోయిజంతో నిర్మాతలు ప్రేక్షకులను ఇద్దరినీ ఏడిపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఒకప్పుడు టాలీవుడ్ మూవీస్ లో కామెడీ ఉండేది అని చెప్పుకునే ప్రమాదం జరగొచ్చు. అది జరగాలంటే జంధ్యాల-ఈవివి లాంటివి వాళ్ళు మళ్ళి పుట్టరు కానీ వాళ్ళను కనీసం స్ఫూర్తిగా తీసుకుని నవతరం దర్శకులు ఆలోచిస్తే మంచిది

    

Tags:    

Similar News