`ఎల్బీడబ్యూ` సినిమాతో హీరోగా మారాడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ మూవీ సక్సెస్ కావడంతో మెయిన్ లీడ్ గా కొన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. ఆ తరువాత మళ్లీ ప్రవీణ్ సత్తారు చేసిన `గుంటూర్ టాకీస్` సిద్ధూకు మళ్లీ హిట్ ఇచ్చింది. రాజశేఖర్ నటించిన `కల్కి`లో విలన్ ఛాయలున్న శేఖర్ బాబు పాత్రలో నటించాడు. ఆ తరువాత మళ్లీ హీరోగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో సిద్ధూ జొన్నలగడ్డ చేసిన కృష్ణ మిస్ లీలా, మా వింత గాథ వినుమా వంటి చిత్రాల్లో నటించాడు.
నటుడిగా మంచి అవకాశాలు దక్కపోవడంతో `గుంటూర్ టాకీస్` చిత్రంతో రైటర్ గానూ మారిపోయాడు. ఈ చిత్రానికి కథ, మాటలు అందించడమే కాకుండా గాయకుడిగా కూడా మారాడు సిద్దూ. రైటర్ గా చేసిన తొలి ప్రయత్నం మంచి ఫలితాన్ని అందించడంతో తను హీరోగా నటించే చిత్రానికి తానే రైటర్ అయ్యాడు. ఆ తరువాత ఇదే పంథాను కృష్ణ మిస్ లీలా, మా వింత గాథ వినుమా వంటి చిత్రాలకు ఫాలో అయ్యాడు. సిద్దూ జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం `డీజే టిల్లు`. ఈ నెల 12న థియేటర్లలో సందడి చేయబోతోంది.
విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ టీజర్, ట్రైలర్, లిరికల్ వీడియోస్ ఇప్పటికే సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ స్లాంగ్ లో హీరో క్యారెక్టర్ ని మలిచిన తీరు, మధ్య తరగతి యువకుడిగా సిద్దూ జొన్నలగడ్డ కనిపించిన విధానం యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. అంతే కాకుండా తమన్ అందించిన నేపథ్య సంగీతం, శ్రీచరణ్ పాకాల, రామ్ మిర్యాల అందించిన సాంగ్స్ సినిమాకు ప్లస్ గా మారాయి.
అంతే కాకుండా ఇటీవల హీరోయిన్ పుట్టుమచ్చల వివాదం, హీరో హీరోయిన్ ల లిప్ లాక్, ఇద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ వెరసి `డీజే టిల్లు`ని వార్తల్లో నిలిపింది. సోషల్ మీడియాలో సినిమాని వైరల్ అయ్యేలా చేసింది. సిద్ధూ జొన్నలగడ్డ నటించిన గత చిత్రాలతో పోలిస్తే `డీజే టిల్లు` సోషల్ మీడియాలో పుట్టుమచ్చల వివాదం కారణంగా వైరల్ కావడంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఈ మూవీతో హీరో సిద్ధూ జొన్నలగడ్డ కు బ్రేక్ లభించడం గ్యారంటీ కానీ ఆ క్రెడిట్ మాత్రం హీరోయిన్ నేహా శెట్టికు చెందుకుందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ మూవీకి కూడా సిద్ధూ జొన్నలగడ్డ రైటర్ గా వ్యవహరించారు. దర్శకుడు విమల్ కృష్ణతో కలిసి ఈ చిత్రానికి రచయితగా తన వంతు సహకారాన్ని అందించాడు. తనకు బ్రేక్ రావాలని శ్రమించాడు సిద్ధూ. అయితే ఈ మూవీ సక్సెస్ క్రెడిట్ మాత్రం హీరోయిన్ నేహా శెట్టి ఖాతాలోకి వెళ్లిబోతోంది. కారణం నేహా శెట్టి పుట్టుమచ్చల వివాదం వైరల్ కావడమే. `గుంటూర్ టాకీస్` విషయంలోనూ ఇదే జరిగింది.
సిద్ధూ శ్రమించి కథ, మాటలు అందించి మెయిన్ లీడ్ గా నటిస్తే క్రెటిట్ మొత్తం రష్మీ గౌతమ్ కొట్టేసింది. అదే ఫీట్ ఇప్పుడు `డీజే టిల్లు` విషయంలోనూ రిపీట్ అవుతుండటంతో అంతా బ్యాడ్ లక్ సిద్దూ అంటున్నారు.