బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ''గాలి సంపత్'' సినిమాతో ప్రొడ్యూసర్ గా మారుతున్న విషయం తెలిసిందే. అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అనిల్ దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో పాటు నిర్మాణంలో కూడా భాగం పంచుకుంటున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టోరీ అందిస్తున్న ఎస్. కృష్ణ ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
శ్రీవిష్ణు - రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమా కామెడీ అండ్ తండ్రికొడుకుల ఎమోషన్ మీద సాగుతుందని తెలుస్తోంది. ప్రమాదవశాత్తు మాట కోల్పోయిన సంపత్.. అనుకోకుండా ఓ బావిలో పడతాడు.. అక్కడ నుంచి అతను ఎలా బయటపడ్డాడు.. తండ్రిని వెతికే సమయంలో కొడుకు పడే ఆవేదనను ఇందులో చూపించనున్నారు. అనిల్ రావిపూడి నిర్మాతగా కూడా సక్సెస్ అందుకోవాలని ప్లాన్ చేసుకుని.. అన్నీ తానై భుజాన వేసుకుని ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే 'గాలి సంపత్' సినిమా ఇంత త్వరగా కంప్లీటై బయటకు రావడానికి ప్రధాన కారణం షైన్ స్క్రీన్ బ్యానర్ వారు అని టాక్. గతంలో 'మజిలీ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న షైన్ స్క్రీన్స్ వారు, మళ్లీ అదే తరహా మరో విజయాన్ని అందుకుంటామని నమ్మకంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఓ స్పెషల్ గెస్ట్ తో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించాలని అనిల్ అండ్ షైన్ స్క్రీన్ వారు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అనిల్ రావిపూడి మరియు 'మజిలీ' మేకర్స్ కి 'గాలి సంపత్' ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.