ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ అన్నది కామన్ అనే విషయం అందరికి తెలిసిందే. ఒకరికి విజయాలు వరించినప్పుడు మరొకరు ఆప్యాయంగా పలకరించి అభినందనలు కురిపించడం.. ఒకరి సినిమా 100 డేస్ ఫంక్షన్ లో మరో స్టార్ హీరో పాల్గొనడం.. ఆ ఆనందాన్ని సదరు హీరోతో కలిపి సెలబ్రేట్ చేసుకోవడం 90 లలో బాగా కనిపించాయి. అలాంటి వాతావరణం ఇప్పడూ కనిపిస్తోంది. అయితే కొంత మంది మాత్రం ఒకరు సక్సెస్ లోకి వస్తే జలసీ ఫీలవుతుంటారన్నది గత కొంత కాలంగా వినిపిస్తోంది.
ఒక హీరో సినిమా పోతే మరో హీరో పార్టీలు ఇవ్వడం.. పది మందితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం వంటివి చాలా జరిగేవని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది. కొంత మంది హీరోల మధ్య ఇలాంటి వార్తలు చిచ్చు పెట్టిన సందర్భాలు కూడా వున్నాయి. ఆ తరువాత అవి ఇద్దరి మధ్య తీవ్ర అగాధాన్ని ఏర్పరచడమే కాకుండా జలసీగా మారాయని, ఇద్దరి మధ్య దూరాన్ని పెంచాయని కూడా అంటుంటారు.
80, 90వ దశకాల్లో కొంత మంది అప్పటి స్టార్ హీరోల మధ్య ఇలాంటి జలసీ వార్ నడిచిందని అప్పట్లో కథలు కథలుగా చెప్పారు. అది ఆ తరువాత కూడా సాగిందని ఇప్పటికీ కొంత మంది హీరోలు అందరి ముందు ఒకరంటే ఒకరికి జలసీ లేదని, ఫ్రెండ్లీ వాతావరణంలో వున్నామని వెల్లడించినా తెర వెనుక మాత్రం కథ వేరేగా వుంటుందని, ఒకరి సినిమా పోతే మరొకరు పండగ చేసుకుంటారని, ఒక ప్రాజెక్ట్ తమ చేతిలో నుంచి మరో హీరోకు వెళ్లకుండా అడ్డుతగులుతుంటారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తూ వుంటుంది.
అయితే యూనివర్సల్ స్టార్, సీనియర్ హీరో కమల్ హాసన్ మాత్రం మరొకరి విజయాన్ని చూసి అసూయపడే సమయం లేదని, ఆ అవసరమే మాకు రాలేదని చెప్పడం ఆసక్తికరంగా మారింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాను చాలా చిన్న వయసులోనే ఆ విషయాన్ని గ్రహించి వాస్తవాన్ని తెలుసుకున్నామన్నారు.
`పొన్నియిన్ సెల్వన్` ఈవెంట్ లో పాల్గొన్న కమల్ నటీనటుల మధ్య వుండే ఈర్ష్య, అసూయ గురించి ఆసక్తికరంగా స్పందించారు. సినామా పరిశ్రమ చిన్న కుటుంబం..ఈ కుటుంబంలో అసూయకు సమయం లేదన్నారు. నా పని చేయడానికే నాకు సమయం లేనప్పుడు ఈర్ష్య పడటానికి సమయం ఎక్కడ వుంటుంది? అన్నారు. ఒకరి ఓటమి ఇండస్ట్రీని ప్రభావితం చేస్తుంది. ఒకరి విజయం ఇండస్ట్రీని ఉద్దరిస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ జలసీకి చోటే లేదన్నారు. అయితే వాస్తవ పరిస్థితి కమల్ చెప్పినట్టే వుంటుందా? అంటే వుండదని కొంత మంది ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.