హనుమాన్.. కార్తికేయ సెంటిమెంట్ అయ్యే పనేనా?

Update: 2022-12-02 01:36 GMT
ఇటీవల కాలంలో హిందూ దైవభక్తికి సంబంధించిన సినిమాలకు భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది అనే సెంటిమెంట్ కొనసాగుతోంది. కార్తికేయ 2 సినిమా భారీ స్థాయిలో సక్సెస్ కావడంతో అదే రూట్లో మరికొన్ని సినిమాలు వాటి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా కార్తికేయ 2 సినిమా విడుదలైనప్పుడు అసలు ఈ సినిమా తెలుగులోనే ఓ మోస్తారుగా ఆడుతుంది అని అనుకున్నారు.

కానీ చిత్ర యూనిట్ సభ్యులు సింపుల్ గా ఈ సినిమాను శ్రీకృష్ణ మిస్టరీ నేపథ్యంలో నేషనల్ వైడ్ గా ప్రచారాలు చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాకు మంచి గుర్తింపు రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

అసలు ఒక డబ్బింగ్ సినిమా అక్కడ ఆ స్థాయిలో సక్సెస్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు. హిందుత్వం సెంటిమెంటు దైవభక్తి ఏ రేంజ్ లో కొనసాగుతుందో కార్తికేయ 2 సినిమాతో మరోసారి క్లారిటీగా అర్థమయింది.

అయితే ఇప్పుడు హనుమాన్ సినిమాను కూడా అదే తరహాలో ప్రమోట్ చేయాలి అని సిద్ధమవుతూ ఉండడం విశేషం.  టాలెంటెడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ అనే సినిమాను ఫ్యాన్ ఇండియా మూవీగా తెరపైకి తీసుకువస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే మొదలుపెట్టారు. ఇటీవల విడుదలైన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే.

అయితే రీసెంట్ గా ప్రశాంత వర్మ హీరో తేజ ఇద్దరు కూడా అయోధ్యలోని శ్రీరాముడిని దర్శించుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకుముందు కార్తికేయ యూనిట్ కూడా ఇదే తరహాలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకున్న శ్రీకృష్ణ భక్తులను కూడా కలుసుకుంది.

ఆ కమిటీకి ప్రత్యేకంగా వాళ్లు కార్తికేయ 2 సినిమాలు కూడా చూపించినట్లు ప్రచారాలు చేశారు. అయితే ఇప్పుడు హనుమాన్ సినిమాను కూడా అదే తరహాలో ప్రమోట్ చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు ప్రచారాలు మొదలు పెట్టేసారు. దీంతో కార్తికేయ సెంటిమెంట్ ఈ సినిమాకు కూడా కలిసి వస్తుందని అని ఆలోచిస్తున్నారు. మరి ఈ తరహా ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News