రజనీకాంత్ సినిమాలో నితిన్ భామ

Update: 2018-06-04 16:40 GMT
చూడగానే ఆకట్టుకునే అందం ఉన్నా అమ్మడు చేసిన రెండు సినిమాలు ఊహించని డిజాస్టర్ ఇచ్చాయి. నితిన్ తో కలిసి లై - ఛల్ మోహన్ రంగ సినిమాల్లో కనిపించిన గ్లామర్ బ్యూటీ మేఘ ఆకాష్ గురించి అందరికి తెలిసిందే. మొదట ఈ బ్యూటీ పోస్టర్స్ చూసి అందరూ ఎట్రాక్ట్ అయిపోయారు. తప్పకుండా స్టార్ హీరోయిన్స్ కు పోటీని ఇస్తుంది అనుకున్నారు. కానీ రెండు సినిమాలు ఊహించని దెబ్బ కొట్టడంతో అమ్మడికి అవకాశాలు రావని అంతా అనుకున్నారు.

కానీ ఏకంగా సూపర్ స్టార్ తో నటించే అవకాశమే మేఘ దక్కించుకుంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించే బోయే తరువాత సినిమాలో మేఘా దాదా ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజినీకాంత్ కాలా ప్రమోషన్స్ తో  చాలా బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా అయిపోగానే యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. ఆ సినిమాలో సిమ్రాన్ - బాబీ సింహాతో పాటు విజయ్ సేతుపతి కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

ఇక మరొక ముఖ్యమైన పాత్ర కోసం మేఘా ఆకాష్ ను ఫైనల్ చేశారట. బ్యాడ్ లక్కులో ఉన్న పిల్లకి బంగారం లాంటి అవకాశం అందింది అంటే ఇదేనేమో. ఇటీవల నిర్వహించిన లుక్ టెస్ట్ లో కూడా అమ్మడు పాస్ అయ్యింది. సింగిల్ సిట్టింగ్ లో దర్శకుడు ఆమెను ఫైనల్ చేశాడట. ఇక ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 2018 డిసెంబర్ లోనే సినిమా విడుదల చేయాలనీ అనుకుంటున్నారు.    


Tags:    

Similar News