26 కోట్ల రికవరీ.. స్వీటీకి సాధ్యమేనా?

Update: 2020-04-30 17:30 GMT
సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కరోనాకు ముందు.. కరోనా తర్వాత అన్నట్టుగా మారిందని ఇప్పటికే చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కరోనా క్రైసిస్ సద్దుమణిగిన తర్వాత థియేటర్లు తెరిస్తే జనాలు మునుపటిలా వస్తారా? ఒకవేళ ఆడియన్స్ వచ్చినా గతంలో వచ్చినట్టు కలెక్షన్స్ వస్తాయా అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. దీంతో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాల బడ్జెట్లకు రికవరీ ఎలాగా అని చర్చలు సాగుతున్నాయి.

అనుష్క నటించిన 'నిశ్శబ్దం' ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే థియేటర్లు మూత పడడంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాపై నిర్మాతలు 26 కోట్లు ఖర్చుపెట్టారట. థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈ రేంజ్ బిజినెస్ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో జరగదని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమా కాబట్టి అనుష్క సోలోగా ఈ కలెక్షన్స్ తీసుకురాగలదా అనేది సందేహమే. అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈ సినిమాకు 8 కోట్ల వరకూ రికవరీ చేయవచ్చని భావిస్తున్నారు. అయితే సురేష్ ప్రొడక్షన్స్ తో నిర్మాతలకు ఉన్న రిలేషన్.. ఇతర బిజినెస్ లెక్కల కారణంగా వారే ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసిపెట్టాలట.

అయితే ఒకవేళ సినిమాను రిలీజ్ చేసినా అంత పెట్టుబడి వెనక్కు తీసుకురాగలదా అనేది సందేహమే. ఇదిలా ఉంటే ఒక సినిమా చాలాసార్లు వాయిదా పడడం ఇండస్ట్రీలో ఒక బ్యాడ్ సెంటిమెంట్ అని చాలామంది భావిస్తారు. మరి ఈ సినిమా కూడా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. అయినా ఈ నెగెటివ్ సెంటిమెంట్ ను దాటుకుని మరీ హిట్ అవుతుందా అనేది కూడా వేచి చూడాలి.
Tags:    

Similar News