పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ''హరి హర వీరమల్లు''. ఇది పవన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా. అలానే ఆయన నటిస్తున్న మొట్టమొదటి పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
17వ శతాబ్దం నాటి మొఘలాయిలు - కుతుబ్ షాహీల కాలానికి సంబంధించిన చారిత్రక కథాంశంతో.. ఒక బందిపోటు వీరోచిత గాథగా 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 27వ సినిమాగా అప్పుడెప్పుడో సెట్స్ మీదకు వెళ్లిన ఈ భారీ ప్రాజెక్ట్.. వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. షూటింగ్ సజావుగా సాగకపోవడానికి కరోనా పాండమిక్ ఒక కారణం.
పవన్ కళ్యాణ్ కమిటైన సినిమాల ప్రాధాన్యతా క్రమం మారుతూ రావడం కూడా వీరమల్లు కొంత లేట్ అవ్వడానికి కారణమైంది. ఓవైపు రాజకీయాలు చూసుకోవాల్సి రావడంతో.. వీలైనంత త్వరగా పూర్తయ్యే రీమేక్ ప్రాజెక్ట్స్ ని ముందుగా ఫినిష్ చేశారు. కారణాలు ఏవైతేనేం 2021 లోనే రిలీజ్ అవుతుందని చెప్పిన సినిమాని 2022 సమ్మర్ కి షిప్ట్ చేసారు. ఆ తర్వాత 2023 సంక్రాంతికి విడుదల చేస్తామన్నారు. ఫైనల్ గా వచ్చే ఏడాది వేసవిలో తీసుకొస్తామని మేకర్స్ తెలిపారు.
'హరి హర వీరమల్లు' సినిమా లేట్ అవుతూ ఉందటంతో పీకే అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఇటీవల తిరిగి సెట్స్ లో అడుగుపెట్టినందుకు ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్లూ జాప్యం జరిగినా ఇప్పుడు వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. వచ్చే ఏప్రిల్ నాటికి ఈ మూవీ రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తుండగా.. అప్పటికి రెడీ అవ్వడం కష్టమేనేమో అనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.
'హరి హర వీరమల్లు' వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుందని చిత్ర బృందం ధృవీకరించింది. కానీ విడుదల తేదీపై అధికారిక ప్రకటన ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొనే దాన్ని బట్టి డేట్ ని లాక్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్. అందులోనూ పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి మిగతా భాషల్లోనూ అనుకూలమైన తేదీని చూసుకోవాల్సిన అవసర ముంది. ఇటీవల కాలంలో విజువల్ ఎఫెక్ట్స్ మీద ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో.. షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ కు కాస్త ఎక్కువ సమయమే కేటాయించాల్సి ఉంది.
ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే వచ్చే సమ్మర్ లో వీరమల్లు సినిమా విడుదల అవుతుందో లేదో ఇప్పుడప్పుడే చెప్పలేమనే టాక్ వినిపిస్తోంది. ఇక సముద్ర ఖని దర్శకత్వంలో 'వినోదయ సీతమ్' అనే తమిళ్ రీమేక్ లో నటించడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగస్టులోనే సెట్స్ మీదకు తీసుకురావాలనుకున్న ఈ ప్రాజెక్ట్స్ ఆలస్యమైంది. ఇప్పుడు క్రిష్ సినిమాకు డేట్స్ ఇవ్వడంతో.. రీమేక్ మూవీని ఎప్పుడు మొదలు పెడతాడనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది.
మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన 'భవదీయుడు భగత్ సింగ్' మూవీ ఎప్పుడు రెగ్యులర్ షూట్ కు వెళ్తుందో కూడా చెప్పలేకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ రెండేళ్ల క్రితమే అనౌన్స్ చేసిన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఇచ్చారు. కానీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇంత వరకూ పట్టాలెక్కలేదు. 2024లో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పవన్ క్రియాశీలక రాజకీయాల కోసం సినిమాల నుంచి కాస్త విరామం తీసుకునే అవకాశం ఉందనే టాక్ ఉంది.
ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ పవన్ సినిమా కోసం వేచి చూసిన హరీష్.. ఇప్పుడు బాలీవుడ్ హీరోతో ప్రాజెక్ట్ సెట్ చేసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతా ప్రాతిపదికన 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తే కానీ.. మిగతా సినిమాల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశముంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.