ప్లాప్ అయితే డ‌బ్బులిచ్చేస్తాన‌న్న హీరో

Update: 2017-07-13 10:03 GMT
హీరో లాంటి మాట చెప్పాడో బాలీవుడ్ హీరో. సినిమా హిట్ అయితే ఓకే.. కానీ ప్లాప్ అయితే? అన్న ప్ర‌శ్న ద‌గ్గ‌రే మాట‌లు ఆగిపోతాయి. అయితే.. అలాంటి మాట‌కు త‌న‌దైన కొత్త మాట‌ను చేర్చాడు చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న బాలీవుడ్ హీరో ర‌ణ్‌ బీర్ క‌పూర్‌. తాజాగా అత‌గాడు న‌టించిన జ‌గ్గా జాసూస్ చిత్రం ఈ శుక్ర‌వారం విడుద‌ల కానుంది.

గ‌డిచిన కొద్దికాలంగా ర‌ణ్ బీర్ న‌టించిన సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డుతున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో త‌న తాజా చిత్రంపై త‌న‌కెంత న‌మ్మ‌కం ఉంద‌న్న విష‌యాన్ని చెబుతూ.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను చేశారు. జ‌గ్గా జాసూస్ కానీ ప్లాప్ అయితే.. ఆ సినిమాకు తాను తీసుకున్న డ‌బ్బుల్ని తిరిగి ఇచ్చేస్తాన‌న్న భారీ ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించాడు.

ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌ణ‌బీర్ క‌పూర్‌.. తాము సినిమాలు తీసేది డిస్ట్రిబ్యూట‌ర్లు.. నిర్మాత‌లు లాభప‌డాల‌నే కానీ న‌ష్ట‌పోవాల‌ని కాద‌న్నారు. లాభం వ‌స్తుంద‌ని అనుకున్నా.. అలా రాన‌ప్పుడు న‌ష్టాన్ని పంచుకోవ‌టం త‌మ తాత‌ల కాలం నుంచే ఉంద‌ని చెప్పాడు.

'మా తాత రాజ్ క‌పూర్ కాలం నుంచి డ‌బ్బులు తిరిగి ఇచ్చేసే సంప్ర‌దాయం ఉంది. ఇప్పుడు అదే చేస్తా' అని చెప్ప‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న తాత రాజ్ క‌పూర్‌.. త‌న తండ్రి రిషిక‌పూర్ న‌టించిన మేరానామ్ జోక‌ర్ సినిమా ప్లాప్ అయింద‌ని.. ఈ చిత్రానికి త‌న తండ్రికి  పారితోషికం వ‌చ్చిందన్నారు. అయితే.. త‌న తండ్రి త‌ర్వాత న‌టించిన బాబీ చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌టంతో ఆ చిత్రంతో వ‌చ్చిన డ‌బ్బుల్ని మేరానామ్ జోక‌ర్‌ కు న‌ష్టపోయిన వారికి ఇచ్చిన‌ట్లుగా వెల్ల‌డించాడు. త‌న తాత‌.. తండ్రి మాదిరి తాను కూడా త‌న సినిమా కార‌ణంగా న‌ష్ట‌పోతే.. డ‌బ్బుల్ని తిరిగి ఇచ్చేస్తాన‌ని చెప్పాడు. మ‌రింత విశాలమైన మాట‌ల్ని మ‌న టాలీవుడ్ హీరోలు ఎవ‌రైనా చెప్ప‌గ‌ల‌రా?
Tags:    

Similar News