నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా కొనసాగుతున్న అన్ స్టాపబుల్ తదుపరి ఎపిసోడ్ లోకి రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా రాబోతున్న విషయం తెలిసిందే. అతనితోపాటు మరో మాస్ హీరో గోపీచంద్ కూడా మరో అతిథిగా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నాడు. ఎలాంటి కాంట్రవర్సు లేకుండా చాలా సింపుల్ గా ఉండే ఈ ఇద్దరు హీరోలు ఎలాంటి విషయాలపై స్పందిస్తారు అనేది కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది.
ఇక ఆదివారం రోజు ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ పనులను అయితే ముగించారు. అయితే ఈ ఎపిసోడ్ లో బాలయ్య బాబు ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు అనే విషయంలో కూడా అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం అయితే ప్రభాస్ ను ఇబ్బంది పెట్టే విషాయాలపై బాలయ్య బాబు సరదాగా అడగబోతున్నట్లుగా తెలుస్తోంది.
ముఖ్యంగా అందులో పెళ్లి టాపిక్ హైలెట్ గా నిలవబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఎన్నోసార్లు ప్రభాస్ పెళ్లిపై కథనాలు వెలబడ్డాయి. అయితే ఆ విషయంలో ప్రభాస్ బాలయ్య ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెబుతాడు అనేది చూడాలి. అలాగే అనుష్కతో కూడా డేటింగ్ అని అలాగే ఇటీవల కృతి సనోన్ తో డేటింగ్ అని వార్తలు కూడా చాలానే వచ్చాయి. ఆ విషయాలపై కూడా ప్రభాస్ ను బాలయ్య ఇరగటంలో పెట్టే విధంగా ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉందట.
అయితే గతంలో గోపీచంద్ అనుష్క మధ్యలో కూడా కొన్ని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయంలో కూడా గోపీచంద్ బాలయ్య ఓ ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంది. ఇక ప్రశ్నలతో పాటు ప్రతి ఇంటర్వ్యూలో కూడా బాలయ్య స్టార్స్ కు సంబంధించిన ఎమోషనల్ అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఉంటారు.
అయితే ముఖ్యంగా ప్రభాస్ తన తండ్రితో పాటు ఇటీవల పెదనాన్నను కూడా కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకు కృష్ణంరాజు మరణించిన తర్వాత ప్రభాస్ మీడియా ముందు పెద్దగా రియాక్ట్ కాలేదు. ఇక ఆ విషయంలో కూడా బాలకృష్ణ కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇక గోపీచంద్ పర్సనల్ లైఫ్ లో కూడా తన తండ్రి టీ కృష్ణ గారితో పాటు సోదరుడి ని కూడా కోల్పోయాడు. అతని లైఫ్ లో కూడా ఎన్నో విషాద ఘట్టాలు ఉన్నాయి. ఇక వీటిపై కూడా బాలకృష్ణ చర్చించే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.