అనుకున్న రిలీజ్ డేట్ కు విడుదల చేయాలని, ఎంత బ్రేక్ ఇవ్వకుండా,కరోనాకు భయపడకుండా శ్రమించినా ఫలితం కనపడేటట్లు లేదు. పుష్ప టీమ్ ..భారత్ అంతా కరోనా సెకండ్ వేవ్ తో బ్రేక్ పడినా.. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న పుష్ప సినిమా షూటింగ్ మాత్రం ఆపలేదు. ఆఖరికి హీరో అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్ వచ్చినా సుకుమార్ మాత్రం పుష్ప షూటింగ్ కి బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూ చేసారు. అయితే ఫహద్ ఫాజిల్ కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్దితుల్లో షూటింగ్ చేయలేను అని ప్లైట్ ఎక్కేసి, వెళ్లిపోయాక ప్యాకప్ చెప్పారు. అల్లు అర్జున్ మిగతా నటులతో పెట్టి కీలక సన్నివేశాలు, అలాగే విలన్ ఫహద్ ఫాజిల్ పై సన్నివేసాలు పూర్తి చేసేద్దామనుకున్నా ఫలితం లేకుండా పోయింది.
దాంతో ఇప్పుడు రిలీజ్ వాయిదా వేసుకోవాల్సిన పరిస్దితి కనపడుతోంది. ఈ సినిమాను వాస్తవానికి ఆగస్టు 13వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పటికీ పూర్తి స్థాయి పనులు కాకపోవచ్చని అంచనా వేసారట. దాంతో కుదిరితే 'దసరా' బరిలోకి దింపాలనీ .. లేదంటే 'క్రిస్మస్' కానుకగా డిసెంబర్ లో విడుదల చేయాలనే టీమ్ ఉన్నారని సమాచారం. అయితే అదీ కన్ఫర్మ్ గా చెప్పలేము. ఎందుకంటే మిగతా సినిమాల విడుదల తేదీలను బట్టి, ఈ విషయంలో ఇంకా మార్పులు జరిగే అవకాశాలు ఉంది. ఏదైమైనా జూన్ నాటికి ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించి చాలా వరకూ షూటింగు పూర్తైంది. అయితే ఇంకా కీ సీన్స్ పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా హీరో,విలన్ కాంబినేషన్ సీన్స్ తీయాల్సి ఉంది. ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత యూర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్ సినిమా పై అంచనాలని పతాక స్థాయికి చేర్చాయి.