బోయపాటి సినిమాలో రామ్ అలాంటి పాత్రలో కనిపిస్తాడా..?

Update: 2022-09-13 02:30 GMT
'అఖండ' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ బోయపాటి.. ఉస్తాద్ రామ్ పోతినేని తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూట్ కు వెళ్తారని సమాచారం.

ఊర మాస్ దర్శకుడు మరియు ఎనర్జిటిక్ హీరో కలిసి చేయబోతున్న #BoyapatiRapo మూవీపై సినీ అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది రామ్ కెరీర్ లో 20వ చిత్రమైతే.. బోయపాటికి 10వ సినిమా. అంతేకాదు ఇద్దరికీ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్.

తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో RAPO20 సినిమా తెరకెక్కుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇది బోయపాటి మార్క్ కమర్షియల్ హంగులతో రూపొందే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇప్పటికే అగ్ర దర్శకుడు ఈ సినిమా స్క్రిప్ట్ ను లాక్ చేసినట్లు టాక్.

ఇదొక పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఇందులో రామ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారట. సినిమాలో అధిక భాగం కేరళ నేపథ్యంలో సాగుతుందని.. రామ్ ఒక అయ్యప్ప భక్తుడిగా నటిస్తారని అంటున్నారు.

రామ్ రెండు పాత్రల్లోనూ చాలా వేరియేషన్స్ ఉంటాయని.. ప్రస్తుతం రామ్ మాసివ్ మేకోవర్ ఒక క్యారక్టర్ కోసమే అని నివేదికలు ఉన్నాయి. మొత్తం మీద రామ్ ఎనర్జీ మరియు బాడీ లాంగ్వేజ్ కి సరిపడే స్టోరీతో బోయపాటి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి ముందు ప్రధాన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

'ది వారియర్' సినిమాతో పరాజయాన్ని చవిచూసిన రామ్.. ఇప్పుడు బోయపాటి సినిమాపై హోప్స్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ యూట్యూబ్ హిందీ డబ్బింగ్ సినిమాలతో నార్త్ ఆడియన్స్ ను అలరించిన రామ్ & బోయపాటి.. #RAPO20 తో బాలీవుడ్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News