'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికి గాను బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాడు సౌండ్ ఇంజినీర్ రసూల్ పోకుట్టి. సినీ రంగంలో అత్యుత్తమమైనదిగా భావించే అకాడమీ అవార్డ్ గెలుపొందినందుకు దేశానికే గర్వకారణమని అందరూ కొనియాడారు. అయితే అప్పుడు ప్రశంసించిన వారే ఇప్పుడు రసూల్ పై భగ్గుమనే పరిస్థితి వచ్చింది. ఇకపై అతన్ని తెలుగు సినిమాలకు వర్క్ చేయకుండా నివారించాలని డిమాండ్స్ వెల్లువెత్తే వరకూ వెళ్ళింది.
వివరాల్లోకి వెళ్తే.. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ సినీ ప్రముఖులు వరుస పెట్టి ఈ మూవీ గురించి ట్వీట్లు పెడుతున్నారు. అయితే ఇండియన్ టెక్నీషియన్ రసూల్ పూకుట్టికి మాత్రం ట్రిపుల్ అనేది ఒక గే లవ్ స్టొరీగా పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ లో ఒకటీ అర చిత్రాలను డైరెక్ట్ చేసిన మునీష్ భరద్వాజ్ RRR చెత్త సినిమా అని ట్వీట్ చేయగా.. దీనిపై రసూల్ స్పందించాడు. 'గే లవ్ స్టొరీ' అంటూ సంచలన ట్వీట్ చేసాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన విజువల్ వండర్ పై ఇలాంటి చవకబారు కామెంట్స్ చేయడం పై రసూల్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నాయి.
అయితే రసూల్ మాత్రం తన అభిప్రాయాన్ని వెస్ట్రన్ దేశాల మీదకు తోసేశాడు. వెస్ట్రన్ దేశాల్లో RRR సినిమా గురించి అలానే మాట్లాడుకుంటున్నారని.. నేను దాన్నే కోట్ చేసానని తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటున్నారు. రసూల్ కామెంట్స్ పై 'బాహుబలి' నిర్మాత శోభయార్లగడ్డ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
RRR సినిమాని తక్కువ చేస్తూ కామెంట్స్ చేసిన రసూల్ పోకుట్టి పై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని తగ్గించేలా వ్యాఖ్యలు చేసిన టెక్నిషియన్ ను ఇండస్ట్రీకి దూరంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.
రసూల్ తెలుగులో 'అరణ్య' 'పుష్ప: ది రైజ్' 'రాధేశ్యామ్' వంటి సినిమాలకు సౌండ్ డిజైనింగ్ చేశాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న 'పుష్ప 2' చిత్రంలోనూ రసూల్ భాగమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 'పుష్ప' రెండో పార్ట్ నుండి అతన్ని తొలగించాలని సోషల్ మీడియాలో డిమాండ్ పెరుగుతోంది.
టాలీవుడ్ మరియు తెలుగు సినిమా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా.. రసూల్ ను క్రేజీ ప్రాజెక్ట్ లోకి తీసుకోవద్దని దర్శక నిర్మాతలు సుకుమార్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ ను హీరో అల్లు అర్జున్ ని కోరుతూ ట్వీట్లు పెడుతున్నారు. మరి సినీ అభిమానుల డిమాండ్ ను 'పుష్ప' మేకర్స్ పరిగణనలోకి తీసుకుంటారో లేదో చూడాలి.