హీరో కష్టానికి జాతీయ అవార్డు ఖాయమేనా..?

Update: 2022-09-21 03:46 GMT
వినూత్నమైన సినిమాలతో కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఉన్న శింబు.. 'మన్మథ' 'వల్లభ' వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాడు. అయితే మిగతా తమిళ హీరోల స్థాయిలో మార్కెట్ క్రియేట్ చేసుకోలేకపోయాడు. నాలుగేళ్ళ క్రితం 'నవాబ్' సినిమాతో మెప్పించిన శింబు.. చివరగా 'మానాడు' చిత్రంతో ఓటీటీలో సందడి చేసాడు. ఇప్పుడు ''ది లైఫ్ ఆఫ్ ముత్తు'' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు హీరోగా నటించిన చిత్రం 'వెందు తనిందతు కాదు'. ఇది వీరి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ ఈ మూవీని నిర్మించారు. శ్రీ స్రవంతి మూవీస్ వారు ఈ సినిమాని ''ది లైఫ్ ఆఫ్ ముత్తు'' అనే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. తమిళ్ లో మంచి వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రానికి తెలుగులో ఆశించిన ఆదరణ దక్కడం లేదని తెలుస్తోంది.

గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన 'ది లైఫ్ ముత్తు' చిత్రంలో శింబు పెరఫార్మన్స్ కు మంచి మార్కులు పడుతున్నాయి. వివిధ దశల్లో పాత్రకు తగ్గట్టుగా తనని తాను మార్చుకున్న తీరుకి అతనికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా కోసం శింబు ఏకంగా 21 కిలోల బరువు తగ్గారంటేనే ఎంతలా కష్టపడ్డాడో తెలుస్తుంది. అందుకే ఈ చిత్రానికిగాను అతనికి కచ్చితంగా నేషనల్ అవార్డ్ వస్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రీసెంట్ గా చెన్నైలో 'వెందు తనిందతు కాదు' సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత గణేష్ మాట్లాడుతూ.. దర్శకుడు గౌతమ్ మీనన్ తనకు స్టోరీ చెప్పినప్పుడు చాలా కొత్తగా ఉందని.. వెంటనే చేద్దామని చెప్పానన్నారు. ఈ చిత్రానికి కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని.. అందుకు సంబంధించిన కథా చర్చలు కూడా జరుగుతున్నాయని తెలిపారు

ఇందులో హీరో పాత్రను శింబు తప్ప మరొకరు చేయలేరని నిర్మాత అభిప్రాయ పడ్డారు. ఈ మూవీ కోసం శింబు 21 కిలోల బరువు తగ్గారంటే ఆయన ఎంతగా శ్రమించారో అర్థం చేసుకోవచ్చన్నారు. శింబుకు ఈ సినిమాతో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం ఖాయమనని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హీరో శింబు మాట్లాడుతూ.. 'విన్నైతాండి వరువాయా' తరువాత కొన్ని చిత్రాలు హిట్ అయినా.. యాక్టింగ్ పరంగా ఈ సినిమాకు రెస్పాన్స్ బాగా వచ్చింది. ఇది మరిన్ని మంచి చిత్రాలు చేయడానికి ఉత్సాహాన్నిస్తోందని అన్నాడు. దీనికి రెండో భాగం ఉంటుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారని.. జనరంజక అంశాలతో ఫ్యాన్స్ చప్పట్లు కొట్టేలా ఉంటే బాగుంటుందని చెప్పాడు.

ఇకపోతే శింబు నెక్స్ట్ సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. రెండేళ్ల క్రితం గౌతమ్ కార్తీక్ తో కలిసి 'పాదు తలా' అనే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఇది కన్నడ బ్లాక్ బస్టర్ 'ముఫ్తి' చిత్రానికి అధికారిక రీమేక్. అయితే తమిళ్ లో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వర్గాలు వచ్చాయి. దీంతో శింబు తదుపరి సినిమా ఏంటని అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత ఇస్తారెమో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News