2021 సెకండాఫ్ లో సాహో శ్ర‌ద్ధ పెళ్లి.. వ‌రుడు ఎవ‌రు?

Update: 2021-03-03 08:30 GMT
గత కొన్ని నెలలుగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ వివాహం సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి శ్రద్ధా తన చిన్ననాటి ప్రియుడు ప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టను పెళ్లాడుతుంద‌ని ప్ర‌చారం సాగిపోతోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం... శ్రద్ధా కపూర్ - రోహన్ త్వరలో ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వివాహం జరుగుతుందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే దీనిని ఫ్యామిలీ మెంబ‌ర్స్ అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంటుంది. ఇటీవ‌ల ఓ డెస్టినేష‌న్ వెడ్డింగ్ కి శ్ర‌ద్ధా-రోహ‌న్ జంట‌గా వెళ్లారు. అక్క‌డ కెమెరాల‌కు ట్రెడిష‌న‌ల్ లుక్ లో ఫోజులిచ్చారు. ఆ పెళ్లి వేదిక వ‌ద్ద జంట బావుంది! అంటూ చ‌ర్చా సాగింది. అందుకే ఇప్పుడు గుస‌గుస‌లు మ‌రింత‌గా వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రోవైపు శ్ర‌ద్ధా క‌పూర్ ఘాటైన ఎఫైర్ల‌పై గ‌తంలో ర‌క‌ర‌కాల పుకార్లు వినిపించాయి. ఆషిఖి 2 కోస్టార్ ఆదిత్య రాయ్ క‌పూర్ తో ప్రేమాయణం సాగించింద‌ని.. త‌ర్వాత ఏబీసీడీ 2 కోస్టార్ వ‌రుణ్ ధావ‌న్ తోనూ ప్రేమ‌లో ప‌డింద‌ని .. సీనియ‌ర్ ద‌ర్శ‌క‌నిర్మాత హీరో ఫ‌ర్హాన్ అక్త‌ర్ తో స‌హ‌జీవ‌నం సాగించింద‌ని వైర‌ల్ గా గుస‌గుస‌లు వినిపించాయి. అయితే వేటికీ అధికారిక క‌న్ఫర్మేష‌న్ లేదు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే శ్రద్ధా ప్రస్తుతం రణబీర్ కపూర్ తో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో న‌టిస్తోంది. ప్ర‌భాస్ స‌ర‌స‌న పాన్ ఇండియా మూవీ సాహోలో శ్ర‌ద్ధా క‌పూర్ అద‌ర‌గొట్టింది. ఆ త‌ర్వాత తెలుగులో మ‌రో సినిమా చేయ‌లేదు. ఇటీవ‌ల మ‌రో తెలుగు ద‌ర్శ‌కుడితో క‌థా చ‌ర్చ‌లు సాగిస్తోంద‌ని గుస‌గుస‌లు వినిపించినా ఏదీ క‌న్ఫామ్ కాలేదు.
Tags:    

Similar News