ఆ దర్శకుడికి 'శ్రీకారం' బెస్ట్ డెబ్యూ అవుతుందా..??

Update: 2021-03-05 07:35 GMT
యంగ్ హీరో శర్వానంద్.. నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శ్రీకారం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో శ్రీకారం తెరకెక్కుతుండటంతో పాటు హీరో శర్వా మొదటిసారి వ్యవసాయం నేపథ్యంలో సినిమా చేస్తుండటం ఆసక్తి కలిగించే విషయం. శ్రీకారం సినిమా నుండి ఇదివరకే విడుదల చేసిన లిరికల్ సాంగ్స్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసాయి. ప్రత్యేకంగా పెంచల్ దాస్ లిరిక్స్ అందించి మరీ ఆలపించిన 'భలేగుంది బాలా' పాట సంగీతప్రియులకు ఫేవరేట్ అయిందనే చెప్పాలి. కొంతకాలంగా శ్రీకారం సినిమా గురించి సోషల్ మీడియాలో కొన్ని కథనాలు హల్చల్ చేస్తున్నాయి. శ్రీకారం సినిమా వ్యవసాయం నేపథ్యంలో ఉండటంతో మహేష్ బాబు నటించిన మహర్షి ఛాయలు కనిపిస్తాయని వార్తలొచ్చాయి.

కానీ తాజాగా డైరెక్టర్ కిషోర్ స్పందించి.. మహర్షితో తమ శ్రీకారం సినిమాకు ఎలాంటి పోలిక లేదని చెప్పాడు. తను 2016లో తీసిన శ్రీకారం షార్ట్ ఫిల్మ్ పొడిగింపే ఇదని అంటున్నాడట. అన్ని ఉద్యోగాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తామో.. వ్యవసాయానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలనే సందేశంతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తుంది. లైన్ కాస్త పాతదే అనిపించినా కథాకథనాలు బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే మార్చ్ 11న శ్రీకారం విడుదలవ్వడానికి రెడీ అయింది. ఈ సినిమాకోసం చిత్రబృందం మైదానంలో వ్యవసాయం చేసి పంటలు పండించింది. అలాగే ఈ సినిమాకు శతమానం భవతి సినిమాకి కూడా ఎలాంటి పోలికలేదని చెప్పాడు కిషోర్. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన కిషోర్ కు శ్రీకారం మంచి డెబ్యూ అవుతుందేమో చూడాలి.
Tags:    

Similar News