నాలుగేళ్ళ క్రితం 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాతో అభిమానులను అలరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది తారక్ కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఇందులో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటి వరకు స్టార్ హీరో యాక్టింగ్ స్కిల్స్ గురించి సౌత్ కు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు RRR సినిమాతో నార్త్ లో కూడా తారక్ గురించి మాట్లాడుకుంటున్నారు. దీంతో నందమూరి హీరో నుంచి రాబోయే తదుపరి సినిమాలపై అందరి దృష్టి పడింది.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ మూవీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇది తారక్ కెరీర్ లో మైలురాయి 30వ చిత్రం. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ని హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ సరసన నటించబోతున్నట్లు అలియా సైతం ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చింది. ఇదే జరిగితే 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత అలియా తెలుగులో నటించే సినిమా ఇదే అవుతుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించే అవకాశాలు కనిపించనున్నాయి. అందుకే ఆలియాని ఎంచుకొని ఉండొచ్చు.
ఒకవేళ NTR30 మూవీని పాన్ ఇండియా వైడ్ కాకుండా కేవలం తెలుగు మాత్రమే తీయాలని అనుకుంటే మాత్రం.. ఆలియాని తీసుకోవడం వల్ల బడ్జెట్ పెరుగుతుందే తప్ప అదనంగా ప్రయోజనం చేకూరే అవకాశాలు చాలా తక్కువ.
ఇకపోతే RRR సినిమా విషయంలో అలియా అలిగినట్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కారణమేంటో తెలియదు కానీ ఆమె డబ్బింగ్ కూడా చెప్పలేదని వేరే ఆర్టిస్ట్ చేత చెప్పించారని అంటున్నారు. అందుకే రెండో విడత మూవీ ప్రచార కార్యక్రమాలలో కనిపించలేదని అంటున్నారు.
వీటికి బలం చేకూరేలా రాజమౌళిని ఇన్స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం మీద RRR విషయంలో ఏదో జరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో ఆలియా భట్ మరో తెలుగు సినిమా చేయడానికి రెడీగా ఉంటుందా అన్నది చూడాలి.
NTR30 చిత్రాన్ని కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించనున్నారు. ఇదొక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండే రివేంజ్ డ్రామా. ఫిబ్రవరిలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తారక్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కానీ.. ఎందుకో ఆలస్యమైంది.
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాపై అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. RRR తో తారక్ కు ఏర్పడిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.