యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లైన్ లో పెట్టిన సినిమాలలో 'ఆదిపురుష్' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ కలిసి నిర్మించనున్నారు. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ 'రాముడి'గా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడు 'లంకేష్' గా కనిపించనున్నారు. అయితే ఇప్పుడు సైఫ్ నటించబోయే రావణుడి పాత్ర గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఇందులో రావణుడి పాత్రను కాస్త ప్రత్యేకంగా చూపించబోతున్నారట. ప్రస్తుతం సైఫ్ ఉన్న హైట్ కంటే ఎత్తుగా చూపించడం కోసం స్పెషల్ మేకప్ మరియు వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ను ఉపయోగించబోతున్నారని తెలుస్తోంది. దీనికి తగ్గట్టే సైఫ్ అలీఖాన్ ముఖంలో కూడా చాలా మార్పులు కనిపించనున్నాయని అంటున్నారు. కాగా, ఇటీవల సైఫ్ 'ఆదిపురుష్'లో పాత్ర గురించి వెల్లడించిన విషయాలపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. రావణుడిని మానవీయ కోణంలో చూపిస్తారని.. ఎంటర్‌టైనింగ్ గా మనిషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని సైఫ్ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ అయ్యాయి. హిందూ సనాతన ధర్మం ప్రకారం రాముడిని మంచికి చిహ్నంగా రావణుడిని చెడుకి గుర్తుగా చెప్పుకుంటారని.. సైఫ్ వ్యాఖ్యలను బట్టి ఈ సినిమాలో చరిత్రను వక్రీకరిస్తున్నారని కేసులు కూడా నమోదు చేశారు. అయితే చివరకు సైఫ్ అలీఖాన్ క్షమాపణలు కోరడంతో ఈ వివాదం సర్దుమణిగింది.