స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని, త్వరగా స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోవాలని చాలా మంది దర్శకులు ప్రయత్నించి అవకాశాల్ని సొంతం చేసుకుంటున్నారు. కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో అవే సినిమాలు వారి కెరీర్ కు శాపాలుగా మారుతున్నాయి. స్టార్ హీరోలతో సినిమా చేశాక వారి కెరీర్ ప్రశ్నార్థకంలో పడిపోతోంది. ఈ మధ్య ఈ తరహా దర్శకుల సంఖ్య క్రమ క్రమంగా పెరిగిపోతుండటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా చేసిన సాగర్ చంద్రతో పాటు ప్రభాస్ తో అత్యంత భారీ సినిమాలు చేసిన రాధాకృష్ణ కుమార్, సుజీత్ ల పరిస్థితి ఇప్పడు అలాగే వుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీసెంట్ గా మలయాళ హిట్ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' మూవీని తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. 'భీమ్లానాయక్' పేరుతో తెలుగులో రీమేక్ అయిన ఈ మూవీకి అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాల ఫేమ్ సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించారు.
బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే సొంతం చేసుకున్న ఈ మూవీకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో పాటు అన్నీ తానే చూసుకున్నాడు. దీంతో ఈ మూవీ హిట్ అనిపించుకున్నా సాగర్ చంద్రకు మరో ప్రాజెక్ట్ రాకపోవడం గమనార్హం. ఇక ప్రభాస్ తో సినిమాలు చేసిన ఇద్దరు దర్శకులదీ ఇదే పరిస్థితి. ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' మూవీకి రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించారు.
రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ బడ్జెట్ లో చాలా వరకు రికవరీ కాలేదు. దీంతో ఈ దర్శకుడితో పని చేయడానికి ఒక్క హీరో కూడా ముందుకు రావడం లేదట. కనీసం టైర్ 2 హీరోలు కూడా పెద్దగా ఆసక్తి చూపించకపోవడం అతని పరిస్థితికి అద్దంపడుతోందని ఇన్ సైడ్ టాక్. ఇక ఇదే దర్శకుడి తరహాలో ప్రభాస్ తో కలిసి వర్క్ చేసిన దర్శకుడు సుజీత్.
ప్రభాస్ - సుజీత్ ల కలయికలో 'సాహో' మూవీ రూపొందిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ దక్షిణాదిలో పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఉత్తరాదిలో మాత్రం ఫరవాలేదనిపించింది. దీంతో సుజీత్ తో సినిమా చేయడానికి పెద్దగా హీరోలు ఆసక్తి చూపించడం లేదట. గతంలో 'గాడ్ ఫాదర్', విజయ్ 'పోలీసోడు' (తెలుగు రీమేక్) సినిమాలకు సుజీత్ పేరు వినిపించింది. కానీ చివరి నిమిషంలో 'గాడ్ ఫాదర్' కు దర్శకుడు మారగా 'పోలీసోడు' రీమేక్ ఇప్పటికీ చర్చల దశలోనే వుండిపోయింది.
దీంతో చాలా మంది భారీ బడ్జెట్ సినిమాలు చేసినా వాటిని సక్రమంగా తెరపై ఆవిష్కరించకలేకపోతే ఎలాంటి ఫలితాలని అందిస్తాయో వీరే బెస్ట్ ఎగ్జాంపుల్ అని, ప్రస్తుతం తనతో సినిమాలు చేస్తున్న వారు వీరిని చూసి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయట.