ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకులలో కొరటాల శివ ఒకరు. 'మిర్చి' చిత్రంతో డైరెక్టర్ గా మారిన ఈ రైటర్.. సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేసారు.
కొరటాల శివ సినిమాలన్నీ క్లాస్ అప్రోచ్ తో ఉండే కమర్షియల్ ఎంటర్టైన్స్ కావడంతో.. ఓవర్ సీస్ లోనూ మంచి క్రేజ్ ఉంది. ప్రభాస్ హీరోగా రూపొందించిన 'మిర్చి' మూవీ యూఎస్ లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఫుల్ రన్ లో 636K డాలర్ల వసూళ్లతో దర్శకుడికి ఫస్ట్ హిట్ అందించింది.
మహేష్ బాబుతో కొరటాల చేసిన 'శ్రీమంతుడు' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి. యూఎస్ఏలో ఈ చిత్రం 2.8 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన 'జనతా గ్యారేజ్' చిత్రం ఫుల్ రన్ లో $1.8 మిలియన్లు కలెక్ట్ చేసింది.
మహేష్ - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా 'భరత్ అనే నేను' బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. యూఎస్ లో ఈ మూవీ 3.4 మిలియన్లు సాధించి సంచలనం సృష్టించింది. ఓవర్ సీస్ లో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కొరటాల.. ఇప్పుడు ''ఆచార్య'' సినిమాతో వచ్చారు.
మెగా తండ్రీకొడుకులు చిరంజీవి - రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన 'ఆచార్య' సినిమా రేపు శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది. ఈరోజు గురువారం యూఎస్ లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. అక్కడ 3200 కి పైగా స్క్రీన్లలో ఈ సినిమా విడుదల కాబోతోంది.
'ఆచార్య' అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పుంజుకున్నాయి. ఇప్పటి వరకు యూఎస్ఏ ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ 305 లొకేషన్స్ (957 షోలు) లో $475K డాలర్లుగా ఉన్నాయి. ప్రీమియర్స్ + ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి 1 మిలియన్ డాలర్లు క్రాస్ చేస్తుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ప్రీమియర్ షోల మౌత్ టాక్ బాగుండి, పాజిటివ్ రివ్యూలు వస్తే.. విడుదల తర్వాత 'ఆచార్య' కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. చిరు - చరణ్ లతో జోడీ కట్టిన ఈ సినిమా కొరటాల శివ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో.. యుఎస్ లో ఏ మేరకు కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో చూడాలి.
'ఆచార్య' సినిమాని సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.