‘వేద్’ సినిమా మరో ‘కాంతారా’ అవుతుందా?

Update: 2022-10-28 00:30 GMT
ప్యాన్ ఇండియా ట్రెండ్ తెరపైకి వచ్చినప్పటి నుంచి సౌత్ సినిమాల హవానే కొనసాగుతోంది. కరోనా లాక్డౌన్ కాలంలో ఓటీటీ కంటెంట్ కు అలవాటు పడిన ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనం కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ మూసకథలను నార్త్ ఆడియన్స్ నిర్ధాక్షిణ్యంగా తిప్పి కొడుతున్నారు. ఇదే సమయంలో సౌత్ సినిమాలను విపరీతంగా ఆదరిస్తున్నారు.

తెలుగు.. తమిళ్.. కన్నడ సినిమాలు ఆయా భాషల్లోనే కాకుండా హిందీలోనూ మంచి వసూళ్లను రాబడుతున్నాయి. దక్షిణాదిన దేవుడి బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమాలన్నీ నార్త్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నాయి. ‘కార్తీకేయ-2’.. ‘కాంతారా’ వంటి చిన్న సినిమాలు సైతం హిందీలో బ్లాక్ బస్టర్ హిట్టందుకొని మంచి కలెక్షన్లు రాబట్టాయి.

హీరో కమ్ దర్శకుడిగా రిషబ్ శెట్టి ‘కాంతారా’ను అద్భుతంగా తెరకెక్కించాడు. దర్శకుడే హీరో అయితే సినిమా అవుట్ ఎలా వస్తుందనే దానికి ఒక మంచి ఉదాహరణగా ‘కాంతారా’ నిలుస్తోంది. గతంలోనూ పలువురు స్టార్స్ ఇలాంటి ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. తాజాగా రితీష్ దేశ్ ముఖ్ సైతం ఇలాంటి సాహసమే చేయబోతున్నాడు. మరాఠి సినిమా ‘వేద్’తో దర్శకుడిగా మారాడు.

ఈ మూవీలో రితీష్ హీరోగా నటిస్తుండగా అతడి భార్య జెనీలియా హీరోయిన్ గా నటిస్తోంది. హిందూ సంప్రదాయాలు.. ధర్మం.. దేవుడితో ముడిపడి ఉన్న సినిమాలను బాలీవుడ్ ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు. ఇక ‘వేద్’ టైటిల్.. ఫస్టు లుక్ చూస్తుంటే ఈ సినిమా కూడా ఈ కోవలోనే తెరకెక్కినట్లు అర్థమవుతోంది.

ఈ సినిమాపై రితీష్ దేశ్ ముఖ్ భారీ అంచనాలను పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రితేష్ దేశ్ ముఖ్ బాలీవుడ్లో రెండు దశాబ్దాలుగా నటుడిగా కొనసాగుతున్నాడు. అయినప్పటికీ మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ కుమారుడిగా.. జెనీలియా భర్తగానే గుర్తింపు పొందుతున్నాడు.రితీష్ కెరీర్లో కొన్ని సూపర్ హిట్స్ ఉన్నప్పటికీ అతడి వల్లే సినిమా విజయం సాధించిందనే గుర్తింపు మాత్రం దక్కలేదు.

అలాంటిది ఇప్పుడు దర్శకుడు కమ్ హీరోగా రితీష్ మారి ‘వేద్’ను తెరకెక్కిస్తుండటం నిజంగా సాహసమనే చెప్పాలి. పెళ్లి తర్వాత కుటుంబానికే పరిమితమైన జెనీలియా ఈ సినిమాతో తిరిగి మేకప్ వేసుకుంటోంది. వీరిద్దరికీ ఈ సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News