టాలీవుడ్ బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్లు అందుకుంటోంది కియరా అద్వాణీ. అగ్రహీరోలతో ఆఫర్లకు కొదవేమీ లేదు. ఆ క్రమంలోనే ఈ బ్యూటీ సీక్రెట్ లవ్ గురించి యూత్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. కియరా అద్వాణీ-సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా మీడియాలో వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. పబ్లిక్ గా చాలాసార్లు మీడియా కంటపడ్డారు. జనవరి 2021లో కొత్త సంవత్సర వేడుకల కోసం ఈ జంట మాల్దీవులకు వెళుతూ మీడియాకి చిక్కింది. కానీ దాన్ని స్నేహం మాత్రమే అని అన్నారు. ఒకరితో ఒకరు సన్నిహితంగా మెలుగుతూ.. స్నేహాన్ని మించిన సాన్నిహిత్యం అన్నారు. ఇలా కొంత కాలం నుంచి ఈ జంట దాగుడుమూతలు ఆడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు అన్నింటికి సమాధానం చెప్పే సమయం ఆసన్నమైందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది.
కొత్త ఏడాది 2022 లో ఓపెన్ అప్ అవ్వాలని జంట డిసైడ్ అయినట్లు బాలీవుడ్ వర్గాల టాక్. సుదీర్ఘ ప్రేమ కలాపానికి ఫుల్ స్టాప్ పెట్టి అంతా బహిర్గతం చేయాలని ఈ జంట ప్లాన్ చేస్తోందిట. ప్రకటన అనంతరం పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అన్న దానిపై కూడా క్లారిటీ ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఈ జంట ప్రేమను దాటి పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నట్లు మీడియాలో ప్రచారం సాగుతోంది.
విక్కీ కౌశల్- కత్రినాకైఫ్ పెళ్లి చేసుకోవడం.. ఇతర జంటలు కూడా ప్రతిదీ ఓపెనైపోతుండడంతో ఈ సీజన్ జంటల్లో మార్పులకు శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. కత్రిన-విక్కీ జంట పెళ్లి తర్వాత రణబీర్ కపూర్-అలియా భట్ కూడా పెళ్లి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమలో రణబీర్ అలియాని పబ్లిక్ గానే పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే మూడ్ లో కియరా-సిద్ధార్థ్ మల్హోత్రా జంట ఓపెనైపోతుందని ఈ ప్రేమాయణం కూడా పెళ్లి కి దారి తీస్తుందని ఊహిస్తున్నారు. కియరా ప్రస్తుతం శంకర్ -రామ్ చరణ్ కాంబినేషన్ మూవీ ఆర్.సి 15కి సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ కోసం ఎన్టీఆర్ మూవీని సైతం పక్కన పెట్టేసిందని కథనాలొచ్చాయి.