`పుష్ప 2`కి సేమ్ టీమ్ కంటిన్యూ అవుతుందా?

Update: 2022-02-02 13:34 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్టార్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ క‌ల‌యిక‌లో ముచ్చ‌ట‌గా వ‌చ్చిన మూడ‌వ చిత్రం `పుష్ప ది రైజ్‌`. మైత్రీ మూవీమేక‌ర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రం ఊహించ‌ని విధంగా వ‌సూళ్ల సునామీని సృష్టించి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేసింది. మ‌రీ ముఖ్యంగా ఉత్త‌రాదిలో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ని కాబ‌డుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు.

మేక‌ర్స్ తో పాటు ద‌ర్శ‌కుడు సుకుమార్ కూడా ఈ మూవీ ఉత్త‌రాదిలో రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతుంద‌ని అంచ‌నా వేయ‌లేక‌పోయాడు. అంచ‌నాల‌కు భిన్నంగా ఎలాంటి ప‌బ్లిసిటీ లేకుండానే ఈ చిత్రం ఉత్త‌రాది బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల మైలు రాయిని దాటి ట్రేడ్ ఎన‌లిస్ట్ ల‌కే స‌వాల్ విసిరింది. డిఫ‌రెండ్ స్ట్రాట‌జీతో దూసుకుపోయిన `పుష్ప‌` దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించి బ‌న్నీని పాన్ ఇండియా స్టార్ గా నిల‌బెట్టింది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో త్వ‌ర‌లో ప్రారంభం కానున్న `పుష్ప 2` విష‌యంలో సుకుమార్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌. భారీ మార్పుల‌కు కూడా శ్రీ‌కారం చుట్టిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. పార్ట్ 1పై ఏర్ప‌డిన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని పార్ట్ 2 `పుష్ప :ది రూల్‌` ని మ‌రింత ప‌క్క‌గా.. మ‌రిన్ని ప్ర‌త్యేక‌త‌ల‌తో తెర‌పైకి తీసుకురావాల‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్న‌ట్టుగా ఫిల్మ్ స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో `పుష్ప 2`కి సేమ్ టీమ్ కంటిన్యూ అవుతుందా?.. పుష్ప 1లో జ‌రిగిన త‌ప్పుల్ని సుక్కు ఈసారి రిపీట్ చేయ‌కుండా ఉండ‌టానికి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోనున్నాడా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. తాజాగా వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం సుకుమార్ `పుష్ప‌`ని మించి `పుష్ప 2` తెర‌కెక్కించాల‌ని బావిస్తున్నార‌ట‌. ఇందులో భాగంగా టీమ్‌లో భారీ మార్పులు చేస్తున్న‌ట్టుగా  వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ మార్పుల్లో భాగంగా ర‌సూల్ పూ కొట్టి బృందం మీద వేటు ప‌డ‌నుందా...! నిజ‌మే అనే టాక్స్ అయితే గ‌ట్టిగా వినిపిస్తోంది. కార‌ణం సౌండ్ కి సంబంధించిన విమ‌ర్శ‌లు వినిపించ‌డ‌మేన‌ని తెలుస్తోంది. దీంతో సౌండ్ విష‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో భాగంగానే ర‌సూల్ పూ కొట్టి బృందం మీద వేటు వేయ‌నున్న‌ట్టుగా తెలుస్తోంది.
Tags:    

Similar News