హాలీవుడ్ లో ప్రతి ఏడాది కొన్ని వందల సినిమాలు వస్తాయి. కాని అందులో కొన్ని మాత్రమే ఎప్పటికి గుర్తుండి పోతాయి. అలా గుర్తుండి పోయే సినిమాల్లో ఒక సినిమా 300. తెలుగులో కూడా ఈ సినిమా '300 యోదులు' అనే టైటిల్ తో వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇంగ్లీష్ తో పాటు పదుల సంఖ్యల భాషల్లో సూపర్ హిట్ అయిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 2007 లో వచ్చిన విషయం తెల్సిందే. జాక్ స్నైడర్ దర్శకత్వంలో వార్నర్ బ్రదర్స్ బ్యానర్ లో వచ్చిన 300 సినిమా వసూళ్ల పరంగా అవార్డులు రివార్డుల పరంగా ఆ ఏడాది దుమ్ము రేపింది. హాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ లేదా ఫ్రాంచైజ్ లు రావడం ఖాయం. అలాగే 300 సినిమాకు కూడా సీక్వెల్ వచ్చింది.
300 సినిమాకు 2014 లో ‘300 : రైజ్ ఆఫ్ యాన్ ఎంపైర్’ ఫ్రాంచైజీ మూవీ వచ్చింది. మరో సారి 300 సూపర్ హిట్ అయ్యింది. రెండు పార్ట్ లు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మూడవ పార్ట్ కోసం సహజంగానే ఎదురు చూపులు ఉంటాయి. 300 సినిమా అభిమానులు మూడవ పార్ట్ కోసం ఎదురు చూస్తున్న ఈసమయంలో దర్శకుడు జాక్ స్నైడర్ షాకింగ్ ప్రకటన చేశాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆరు సంవత్సరాలైనా 300 సినిమాలోని కొత్త సిరీస్ పట్టాలెక్కలేదు. ముందు ముందు కూడా ప్రారంభం అవుతుందనే నమ్మకం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాటలను బట్టి వార్నర్ బ్రదర్స్ సంస్థ మూడవ పార్ట్ కు ఆయన తయారు చేసిన కథను తిరష్కరించారట.
ఇంతకు జాక్ స్నైడర్ రాసిన కథ ఏంటీ అంటే.. కథలోని అలెగ్జాండర్ ది గ్రేట్ మరియు ఆయన ప్రాణ స్నేహితుడు అయిన హెప్ హెయిస్టియన్ తో లెస్బియన్ గా మారిపోతాడు. ఇద్దరు గేలవర్స్ మద్య సాగే కథతో మూడవ పార్ట్ ను సిద్దం చేశాడు. గే లవ్ స్టోరీ 300 వంటి యాక్షన్ సినిమాలకు సెట్ అవ్వదనే ఉద్దేశ్యంతో నిర్మాతలు కథను తిరష్కరించారు. దాంతో దర్శకుడు జాక్ స్నైడర్ సినిమా ఆలోచన మానుకున్నాడు. కొత్త కథను తయారు చేయాలని ఆయన భావించడం లేదట. దాంతో 300 ప్రాంచైజీ లో కొత్త సినిమా రావడం దాదాపు అసాధ్యం అంటూ హాలీవుడ్ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.