సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'అతడు' 'ఖలేజా' తర్వాత వీరి కలయికలో రాబోతోన్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇందులో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీలీల ను తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
నిజానికి గతేడాది SSMB28 అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడే ఈ సినిమాలో శ్రీ లీల నటిస్తుందని టాక్ వచ్చింది. కాకపొతే అప్పటి స్క్రిప్టు వేరు. మహేశ్ కోసం త్రివిక్రమ్ ఇప్పుడు కొత్త కథను సిద్దం చేశారని తెలుస్తుంది. ఇది దర్శకుడి గత చిత్రాల టెంప్లెట్ లోనే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అవుతుందని అంటున్నారు. ఇందులోనూ త్రివిక్రమ్ సినిమాల్లో కామన్ గా కనిపించే రెండో హీరోయిన్ పాత్ర వుంటుందని.. దాని కోసం శ్రీలీల ని తీసుకున్నారని అంటున్నారు.
'పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది అందాల భామ శ్రీ లీల. తొలి చిత్రంతోనే యువ హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ తలుపు తట్టాయి. ప్రస్తుతం అమ్మడి చేతిలో అర డజనుకు పైగానే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం అందుకుందని టాక్ నడుస్తోంది.
త్రివిక్రమ్ సినిమాలలో సెకెండ్ హీరోయిన్ కి పెద్దగా ప్రాధానత్య ఉండదు. 'జల్సా' లో పార్వతీ మెల్టన్.. 'అత్తారింటికి దారేది' లో ప్రణీత.. 'అ ఆ' లో అనుపమ పరమేశ్వరన్.. 'అరవింద సమేత' చిత్రంలో ఈషా రెబ్బా.. 'అల వైకుంఠపురములో' మూవీలో నివేదా పేతురాజ్.. ఇలా ప్రతీ చిత్రంలో అలాంటి పాత్రలు ఉన్నాయి. కానీ సినిమాలో వారికి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. అవి వాళ్ళ కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడని పాత్రలు. మరి ఇప్పుడు SSMB28 లో శ్రీ లీల రోల్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే మహేష్ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా మార్చడానికి త్రివిక్రమ్ తన కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా ఓ ఐటమ్ సాంగ్ ని భాగం చేస్తున్నారట. త్రివిక్రమ్ ఇప్పటి వరకూ ఐటమ్స్ సాంగ్ జోలికి వెళ్ళలేదు. అత్తారింటికి దారేదిలో ఒక స్పెషల్ సాంగ్ పెట్టారు కానీ.. దాన్ని ఐటమ్ పాటగా అనుకోలేం. కానీ ఇప్పుడు SSMB28 మూవీలో ఐటమ్ సాంగ్ కు అవకాశం ఉండటంతో తొలిసారి ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.
కాగా, SSMB28 చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.