కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో.. తీవ్రంగా వణికిపోతున్న రంగం సినిమా రంగం. జనాల్లో పెద్దగా భయం ఉన్నట్టు కనిపించట్లేదు. చాలా మంది మాస్కుల్లేకుండానే తిరిగేస్తున్నారు. భౌతిక దూరంలోనూ పెద్దగా సీరియస్ నెస్ కనిపించట్లేదు. కానీ.. సినీ ఇండస్ట్రీ మాత్రం తీవ్రంగా భయపడుతోంది.
తొలి దశ లాక్ డౌన్ నష్టాలే ఇంకా పూడ్చుకోలేదు. అలాంటిది.. మరోసారి థియేటర్లపై ఆంక్షలు విధిస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతోంది. ఇప్పటికే.. పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు తీసుకొస్తున్నాయి. సినిమా థియేటర్లకు సంబంధించి.. కర్నాటక, తమిళనాడు మళ్లీ 50 శాతం ఆక్యుపెన్సీని అమల్లోకి తెచ్చేశాయి. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచి? అనే చర్చ మొదలైంది.
ప్రస్తుతం వకీల్ సాబ్ వంటి భారీ చిత్రం థియేటర్లో ఉన్నది కాబట్టి ఆగాయని అంటున్నారు. అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం డేట్ ఫిక్స్ చేశారని కూడా ప్రచారం సాగుతోంది. వకీల్ సాబ్ 9వ తేదీన విడుదలైంది. సరిగ్గా వారం సమయం ఇచ్చి 15వ తేదీ నుంచి 50 శాతం సీటింగ్ నిబంధన అమల్లోకి తేబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ విషయం తెలియడం వల్లే శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ వెనక్కు వెళ్లిందని అంటున్నారు. వకీల్ సాబ్ రిలీజైన నెక్స్ట్ వీక్ రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఆ తర్వాత వారం.. అంటే ఈ నెల 23న టక్ జగదీష్ విడుదల కావాల్సి ఉంది. మరి, నాని ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడన్నది సస్పెన్స్ గా మారింది. సగం సీటింగ్ కెపాసిటీతో సినిమాను రిలీజ్ చేస్తారా? లేదా? అనే చర్చ నడుస్తోంది.
అయితే.. సంక్రాంతికి 50 శాతం సీటింగ్ కెపాసిటీతోనూ సినిమాలు వచ్చాయి. హిట్ అయినవి కలెక్షన్లు కూడా గట్టిగానే సాధించాయి. మరి, ఈ అనుభవాలతో ‘టక్ జగదీష్’ థియేటర్లకు వచ్చేస్తాడా? రిస్క్ ఎందుకులే అని వెనక్కు వెళ్లిపోతాడా? అన్నది చూడాలి.