చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక కార్యక్రమంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఆనందం..భావోద్వేగాల మధ్య సాగే వేడకల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్ణణ వాతావరణం చోటు చేసుకుంది. తొలుత ఇదంతా సరదాగా జరుగుతోన్న ఓ ప్రాంక్ లాంటి సన్నివేశం అనుకుని అంతా పొరబడ్డారు.
ఆ తర్వాతే అర్ధమవుతుంది అది పెద్ద గొడవ అని.. ఇంతకీ ఆ ఘర్ణణకి కారణం ఏంటి? ప్రఖ్యాత వేదికపై చోటు చేసుకున్న ఆ సన్నివేశం ఏంటి అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. వేదికపై అమెరికా కమెడియన్ క్రిస్ రాక్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో వీక్షకుల్ని నవ్వుల్లో ముంచెందుకు ఓ కామెడీ ట్రాక్ చెప్పుకొచ్చారు. అందులో ప్రముఖ నటుడు విల్ స్మిత్ సతీమణి జాడా పింకెట్ ప్రస్తావన తీసుకొచ్చాడు.
జుట్టు పూర్తిగా తొలగించుకుని వేడుకకు హాజరైన ఆమెను 'జీ ఐ జెన్' చిత్రంలో డెమీ మూర్ ప్రదర్శించిన పాత్రతో పొల్చాడు యాంకర్. ఈ సినిమాలో పాత్రధారి పూర్తిగా గుండుతో కనిపిస్తారు. జాడా పింకెట్ ఇప్పుడా సినిమా సీక్వెల్ లో కనిపించనున్నారంటూ కామెడీ చేసే ప్రయత్నం చేసాడు. అయితే పింకెట్ 'అలోపేసియా' అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఆ కారణంగానే పింకెట్ కి జుట్టు అంతా ఊడిపోయింది. ఈ విషయాన్ని ఇటీవలే ఆమె రివీల్ చేసారు.
అయితే అప్పటివరకూ స్మిత్ నవ్వుతూ కనిపించాడు. అలా ఒక్కసారిగా పైకి లేచి వేదికపై కి వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా నిశబ్ధం అలుముకుంది. వెళ్లగానే స్మిత్..వెంటనే క్రిస్ చెంపపై చాచి కొట్టాడు. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులకు ప్రాంక్..సరదా సన్నివేశం అనుకున్నారు. కానీ స్మిత్ మళ్లీ తన సీటులోకి వచ్చి కూర్చొని "నా భార్య పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదు. నీనోట ఆ పేరు రావొద్దు" అంటూ రెండు సార్లు బిగ్గరగా అరిచారు.
దీంతో ప్రకేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదంతా సీరియస్ అని అప్పుడే అర్ధమైంది. స్మిత్ చెంపదెబ్బ అనంతరం క్రిస్ 'ఒకే' అని సమాధానం ఇస్తూ.. 'టెలివిజన్ చరిత్రలోలనే ఇది ఓ గొప్ప రాత్రి' అంటూ వ్యాఖ్యానించాడు.
ఆ తర్వాత కాసేపటికి ఆ సన్నివేశం చల్లారింది. తర్వాత యధావిధిగా వేడుక జరిగింది. యాంకర్లు అతి చేస్తే ఎలా ఉంటుందో స్మిత్ చెంపదెబ్బ ఓ గుణపాఠం అంటూ నెటి జనులు కామెంట్లు చేస్తున్నారు.