ప్రియలా కన్ను కొడితే ఏడాది బ్యాన్

Update: 2018-03-19 07:18 GMT
దేశంలో కన్నుకొట్టే నైపుణ్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది మలయాళ అమ్మాయి ప్రియ ప్రకాష్ వారియర్. ‘ఒరు అడార్ లవ్’ సినిమా కోసం రూపొందించిన ఒక పాటలో ఆమె కన్ను కొట్టిన వైనం చూసి కోట్లాది మంది కుర్రాళ్ల గుండెలు లయ తప్పాయి. ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. నాటి నుంచి కోట్లాది మంది ప్రియను అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మాయిలు ప్రియను మ్యాచ్ చేసేందుకు చాలా ప్రయత్నమే చేస్తున్నారు. కాలేజీల్లో చాలామంది అమ్మాయిలు ఇదే ప్రయత్నంలో ఉంటుండటం యాజమాన్యాలకు ఇబ్బందిగా మారుతోంది. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఒక కాలేజ్ మేనేజ్మెంట్ ఈ విషయంలో సీరియస్ అయింది.

తమ కాలేజీలో అమ్మాయిలు ఎక్కడ చూసిన కన్ను కొట్టడం ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తుండటంతో ఇక లాభం లేదని ఒక సర్క్యులర్ జారీ చేశారు. కాలేజీ పరిసరాల్లో కన్ను కొట్టడం నిషేధమని.. కాలేజీ అంతటా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని.. ఎవరైనా కన్ను కొట్టడం చేస్తున్నట్లు గమనిస్తే ఏడాది పాటు కళాశాల నుంచి బహిష్కరిస్తామని వీఎల్బీ జానకి అమ్మల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం. ఈ సర్క్యులర్ కాపీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని బట్టి యువతపై ప్రియ ప్రకాష్ వారియర్ ప్రభావం ఏ స్థాయిలో ఉందన్నది అర్థం చేసుకోవచ్చు.

Tags:    

Similar News