హీరోయిన్ రాధతో ఈమె భర్తకు ఎఫైర్ అట!

Update: 2016-08-13 05:14 GMT
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలకు సంబందించిన విషయాలు ఎక్కువగా వార్తల్లో వస్తున్నాయి. ఇదేదో సర్వసాదారణమైన విషయంగా పలువురు భావించడం కూడా ఈ సందర్భంగా దారుణమనే చెప్పాలి. తాజాగా హీరోయిన్ రాధ - తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. ఆమె నుంచి తన భర్తను విడిపించాలని కోరుతూ ఒక మహిళ - చెన్నై పోలీస్ కమీషనర్ ఆఫీసులో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం కొన్ని నెలలుగా జరుగుతుందని, ఈ విషయంపై రాధకు ఎన్ని చెప్పినా ప్రయోజనం లేకపోయిందని ఆమె పేర్కొంది.

కోడంబాక్కం కు చెందిన ఉమాదేవి అనే మహిళ.. తన భర్త మునివేల్ సుందరాట్రావెల్స్ చిత్ర నాయకి రాధతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఈ విషయమై ఇప్పటికే టి. నగర్ మహిళా పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశానని తెలిపింది. అనంతరం ఆ మహిళా పోలీస్ స్టేషన్ కు ఉమాదేవి భర్తను - నటి రాధను పిలిపించి కాసేపు విచారించిన అనంతరం పరిస్థితిని గ్రహించిన పోలీసులు... ఉమాదేవికి తన భర్తను అప్పగించి పంపించేశారు. అయితే నాటి నుంచి.. రాధ నిత్యం తన భర్తకు ఫోన్ చేసి మాట్లాడటంతో పాటు, ఆ మహిళకు కూడా ఫోన్ చేసి బెదిరించడం, ఆమెకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధాలు ఉన్నాయని అసభ్యంగా మాట్లాడటం జరుగుతుందట. దీంతో నటి రాధ బెదిరింపులకు బయపడిన ఉమాదేవి కూతురు - గత నాలుగు రోజులుగా కళాశాలకు కూడా వెళ్లడం లేదని చెబుతుంది. పరిస్థితి ఇలా ఉన్న సమయంలో.. గత కొన్ని రోజులుగా తన భర్త కూడా కనిపించడం లేదని, ఇంటికి రావడం లేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంటూ, ఈసారి మనీషనర్ ను సంప్రదించింది.

నటి రాధ బారినుంచి నుంచి తన భర్తను విడిపించాలని - తన కుటుంబాన్ని కాపాడాలని ఉమాదేవి తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ రేంజ్ లో వ్యవహారం ముదురిపోవడంతో ఉమాదేవి ఫిర్యాదును పరిశీలించిన పోలీస్‌ కమిషనర్ విచారణ జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం చెన్నై మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసు విషయమై పోలీసులు ఒకటి రెండు రోజుల్లో రాధను స్టేషన్ కు పిలిపించి విచారించే అవకాశం ఉంది. కాగా గతంలో కూడా రాధపై దాదాపు ఇలాంటి వ్యవహారంపైనే పోలీసులును ఆశ్రయించారు. తనను ఒక వ్యాపారవేత్త మోసం చేశారనేది ఆమె అప్పుడు ఇచ్చిన ఫిర్యాదు!
Tags:    

Similar News