కోన వెంకట్.. పరిచయం అక్కర్లేని పేరు. ఢీ, దుబాయ్ శీను, దూకుడు, రెడీ, గీతాంజలి, పవర్, నిన్ను కోరి, బలుపు, వెంకీ, శివమణి, అదుర్స్ తదితర విజయవంతమైన చిత్రాలకు మాటలు, కథలు, స్క్రీన్ ప్లే అందించారు. ముఖ్యంగా డైరెక్టర్ శ్రీను వైట్ల అప్పట్లో సాధించిన వరుస విజయాల్లో కోన వెంకట్ పాత్ర కీలకం. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విజయంలోనూ కోన వెంకట్ పాత్ర ముఖ్యమైందే.
తాజాగా కోన వెంకట్.. బాపట్లలో మెగాభిమానులతో సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. కోన వెంకట్ బాబాయి కోన రఘుపతి ప్రస్తుతం బాపట్ల నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో కోన రఘుపతి బాపట్ల నుంచి వైసీపీ తరఫున గెలుపొందారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చారు. ఆ తర్వాత రెండో మంత్రి వర్గ విస్తరణ సమయంలో రఘుపతిని డిప్యూటీ స్పీకర్ గా తొలగించారు.
కాగా 2024 ఎన్నికల్లోనూ కోన రఘుపతే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశముంది. రఘుపతి కుమార్తె కోన నీరజ కూడా కోన వెంకట్ మాదిరిగా సినీ రంగంలోనే ఉన్నారు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ గా కోన నీరజ రాణిస్తున్నారు.
2019 ఎన్నికల్లో కోన నీరజ.. తన తండ్రి విజయం కోసం ప్రముఖ నటీమణి సమంతతో సోషల్ మీడియాలో ప్రకటన చేయించింది. కోన రఘుపతికి ఓటేయాలని సమంత పిలుపునిచ్చింది. వాస్తవానికి ప్రచారానికి బాపట్ల సైతం సమంత వస్తుందని ప్రచారం జరిగింది. ఎందుకంటే నీరజ, సమంత మంచి స్నేహితులు.
మరో కోన వెంకట్ తన బాబాయి రఘుపతి గెలుపు కోసం గత ఎన్నికల్లో తెర వెనుక ఉండి బాగానే కష్టపడ్డారు. వాస్తవానికి కోన వెంకట్.. జనసేనాని పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. పలు ఇంటర్వ్యూల్లో పవన్ కు తాను సోల్ మేట్ నని కూడా చెప్పుకున్నారు. సినీ విమర్శకుడు కత్తి మహేష్.. పవన్ పై విమర్శలు చేసినప్పుడు వాటిని కోన వెంకట్ గట్టిగా మీడియా ముందుకొచ్చి ఖండించారు. అయితే గత ఎన్నికల ముందు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ రాజకీయంపై.. పవన్ విద్వేష రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో అప్పటి నుంచి పవన్ ఆయనను దూరం పెట్టారని టాక్.
ఈ నేపథ్యంలో కోన వెంకట్ బాపట్లలో మెగాభిమానులతో తాజాగా నిర్వహించిన సమావేశం హాట్ టాపిక్ గా మారింది. వాల్తేరు వీరయ్య కు పనిచేయడంతో సక్సెస్ మీట్ లో భాగంగా అభిమానులతో కోన వెంకట్ కలిశారా అనే చర్చ జరుగుతోంది. లేక బాపట్ల నియోజకవర్గంలో కాపులు 35 వేలకు పైగానే ఉన్నారు. బాపట్లలో బ్రాహ్మణులు అతి స్వల్పం. బాపట్ల నియోజకవర్గంలో కాపులు, రెడ్లు, రాజులు, ఎస్సీలు అత్యధిక ఓటర్లుగా ఉన్నారు.
వాస్తవానికి కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు గతంలో గవర్నరుగా, పీసీసీ అధ్యక్షుడిగా ఇలా పలు పదవులు అలంకరించారు. ఈ నేపథ్యంలోనే కోన రఘుపతికి బాపట్లలో వైసీపీ సీటు ఇచ్చింది. ఈసారి కోన రఘుపతి గెలుపు కష్టమనే అంచనాలు ఉన్నాయి. అందులోనూ టీడీపీ– జనసేన పొత్తు కుదిరితే ఇక్కడ నుంచి జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో కాపుల ఓట్లు తమ చేయి జారకుండా చేసుకోవడానికి, వారంతా తన బాబాయి కోన వెంకట్ తో కలిసి సాగడానికి కోన వెంకట్ మెగాభిమానులతో సమావేశం నిర్వహించారని చెబుతున్నారు. అయితే కాపు సామాజికవర్గం మొత్తం ఈసారి జనసేనతో సాగే అవకాశాలున్నాయనే అంచనాల నేపథ్యంలో కోన వెంకట్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచిచూడాలి.