తెలుగు ప్రేక్షకులకు యామీగౌతమ్ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు అనుకుంటా.. ఎందుకంటే సినిమాల పరంగా తక్కువ తెలిసినా ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీగా మాత్రం అందరికి తెలిసే ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో గౌరవం సినిమాతో హీరోయినుగా అడుగుపెట్టింది. ఆ తర్వాత కొన్నాళ్ళు బాలీవుడ్ ఇండస్ట్రీకి అంకితమై.. మళ్లీ నితిన్ సరసన 'కొరియర్ బాయ్ కళ్యాణ్' సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో మళ్లీ తెలుగు వైపు చూడలేదు యామి. బిలాస్పూరులో పుట్టిన ఈ భామ చండీఘర్ లో పెరిగిందట. ఇక యామి తండ్రి ముకేశ్ గౌతమ్ బేసిగ్గా పంజాబీ ఫిల్మ్ డైరెక్టర్ కావడంతో అమ్మడికి సినిమాల వైపు ఆసక్తి కలిగిందని అర్ధమవుతుంది.
లా డిగ్రీ పొందిన ఈ భామ తన 20యేళ్ళ వయసులో యాక్టింగ్ వైపు రావాలని డిసైడ్ అయ్యిందట. ముంబై వచ్చి 'చాంద్ కే పార్ ఛలో'.. 'యే ప్యార్ న హోగా కం' టీవీ సిరీస్ లతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇక 2009లో 'ఉల్లాస ఉత్సాహ' సినిమాతో హీరోయినుగా తన సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత 2012లో 'విక్కీడోనార్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా యామీగౌతమ్ కు ఫస్ట్ హిట్ అందించింది. ఆ సినిమాకి అమ్మడు బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డు కూడా అందుకుంది. అయితే ఈ భామకి సినిమాల కంటే ఎక్కువగా యాడ్స్ తో ఫుల్ పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా ఫేర్ అండ్ లవ్లీ యాడ్ యామిని నేషనల్ వైడ్ పాపులర్ చేసింది.
ఇక దక్షిణాదిన ఈ భామను పట్టించుకోకపోయినా.. బాలీవుడ్ మాత్రం బాగానే ఆదరిస్తుంది. సినిమాలలో యామి ఎన్ని అందాలు ఆరబోసినా హిట్స్ మాత్రం పెద్దగా లేవు. దాంతో ఇక చేసేదేం లేక మళ్లీ మోడలింగ్ స్టార్ట్ చేసింది యామీగౌతమ్. కుదిరినప్పుడల్లా ర్యాంప్ వాకులు, ఫోటోషూట్స్ చేస్తూ కుర్ర గుండెలను దోచుకుంటుంది. ఈ మధ్యే మ్యాగ్జిమ్ మ్యాగజైన్ పై మ్యాగ్జిమమ్ అందాలన్నీ ఆరబోసింది. ఇదిలా ఉండగా అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే. కోట్లలో అభిమానులు ఉన్నారు. తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఓ పిక్ పోస్ట్ చేసింది. తన సినీ కెరీర్ ప్రారంభం అయి ఒక దశాబ్దం పూర్తయిందని గుర్తు చేసుకుంది. ఆ ఫోటోలో సింగిల్ బటన్ స్టైలిష్ డ్రెస్ ధరించి పిచ్చేక్కిస్తుంది ఈ ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ.. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.