అమెజాన్‌ కి షాక్‌ ఇచ్చిన యష్ రాజ్‌ ఫిల్మ్స్‌

Update: 2022-09-22 07:42 GMT
ఓటీటీ లో కేవలం కొత్త సినిమాలు వెబ్‌ సిరీస్ లు మాత్రమే కాకుండా క్లాసిక్ సినిమాలు.. పదుల సంవత్సరాల క్రితం వచ్చిన హిట్‌ మరియు ఫ్లాప్ సినిమాలు చూసే వారు కూడా చాలా మంది ఉంటారు. కొత్త సినిమాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి.. కానీ ఓటీటీ లో పాత సినిమాలను చూసే వారు ఎక్కువ మంది ఉంటారు అనేది ఒక సర్వే రిపోర్ట్‌.

అమెజాన్ వారు హిందీ భాషకు చెందిన ఎన్నో వందల క్లాసిక్ సినిమాలను కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సినిమాలు అమెజాన్ కి దూరం అవ్వబోతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ వారు యష్‌ రాజ్ ఫిల్మ్స్ వారి యొక్క క్లాసిక్ సినిమాలు అమెజాన్ నుండి మాయం అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

యష్‌ రాజ్‌ వారి యొక్క క్లాసిక్ సినిమాలు అయిన దిల్వాలే దుల్హనియా లేజాయేంగే మొదలుకుని ధూమ్ 2.. ధూమ్‌ 3.. రబ్ నే బనా ది జోడి, చక్ దే ఇండియా ఇలా ఎన్నో అమెజాన్ వారికి స్ట్రీమింగ్‌ హక్కులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ హక్కులను శాస్వత ప్రాతిపదికన కాకుండా కొన్ని సంవత్సరాల వరకు అన్నట్లుగానే స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ కొనుగోలు చేసింది.

ఇప్పుడు ఆ కొన్ని సంవత్సరాలు పూర్తి అయ్యాయి. యష్ రాజ్‌ వారితో ఆ సినిమాల యొక్క హక్కులను రినివల్‌ చేసుకునేందుకు అమెజాన్ ప్రయత్నించగా భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారట. దాంతో ఇప్పుడు అమెజాన్ ఆ సినిమాలను వదులుకునేందుకు సిద్ధం అయ్యింది.

అమెజాన్ వారికి భారీ మొత్తం చెప్పి షాక్ ఇచ్చిన యష్‌ రాజ్‌ వారు ఆ సినిమాలన్నింటిని కూడా డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ వారికి మళ్లి కొన్ని సంవత్సరాల టైమ్‌ పీరియడ్ వరకు స్ట్రీమింగ్‌ కు హక్కులను ఇవ్వబోతుంది.

ఒకప్పుడు సినిమాలు విడుదల అయిన తర్వాత లక్షకు రెండు లక్షలకు శాటిలైట్ రైట్స్ ఇస్తే నిర్మాత ఆ సినిమా గురించి మర్చిపోయేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు సినిమా పై జీవితాంతం ఆదాయం వస్తూనే ఉంటుంది. ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ తో క్లాసిక్ సినిమాల యొక్క నిర్మాతలకు పంట పండుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News