ఉమ్మడి తెలుగు రాష్ట్రముఖ్యమంత్రిగా తెలుగు రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన వైఎస్సార్ రాజకీయ జీవితంలోని పాదయాత్ర ఎపిసోడ్ ప్రధాన ఇతివృత్తంగా 'యాత్ర' తెరకెక్కుతోంది. ఈ సినిమా ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది. 2 నిముషాల 4 సెకన్లు నిడివి గల ఈ ట్రైలర్లో దర్శకుడు మహీ వీ రాఘవ్ సినిమాలో ఏముంటుందో చెప్పేశాడు.
వైఎస్సార్ పాత్రధారి మమ్ముట్టితో పార్టీ ఇన్ ఛార్జ్ "ఇది హై కమాండ్ తీసుకున్న నిర్ణయం రెడ్డి. సో యు హ్యావ్ టు ఒబే ది పార్టీ ఆర్డర్స్" అంటాడు.. దీనికి మొహంలో కాస్త అసహనం వ్యక్తం చేస్తూనే ఎంతో మర్యాదగా "నా విధేయత ను విశ్వాసాన్ని బలహీనతగా తీసుకోవద్దండి" అంటూ ఒక పదునైన డైలాగ్ వేస్తాడు. మరో సందర్భంలో "నాయకుడిగా మనకేంకావాలో తెలుసుకున్నాం.. జనాలకేం కావాలో తెలుసుకోలేక పోయాం. తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ కడప దాటి ప్రతి గడపకూ వెళ్ళాలని ఉంది." అంటూ పాదయాత్రకు వైఎస్సార్ మనస్సులో బీజం పడిన సందర్భాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు.
ఎంతో దూకుడు ఉన్నప్పటికీ సంయమనం పాటిస్తూ వైఎస్సార్ పార్టీలో మెలిగిన తీరు.. తనను తను మర్చిపోయానా అన్నట్టుగా ప్రజలతో మమేకమైన తీరును చక్కగా ఆవిష్కరించినట్టుగా కనిపిస్తోంది. "మాటిచ్చేముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక అలోచించేదేముంది" అనే డైలాగ్ చెప్పే సమయంలో మమ్ముట్టి ఇచ్చే ఎక్స్ ప్రెషన్ ట్రైలర్ మొత్తానికి హైలైట్. వైఎస్సార్ పాత్రకు మమ్ముట్టి జీవం పోశారు. ఆ రాజసం.. ఆ ఠీవి మమ్ముట్టి కాకుండా వేరొకరు పోషించి ఉంటే వచ్చేవి కాదేమో.
మిగతా పాత్రలను పెద్దగా చూపించలేదు. టెక్నికల్ గా చాలా రిచ్ గా ఉంది. విజువల్స్.. నేపథ్య సంగీతం చక్కగా కుదిరాయి. యాత్ర అనేది ఒక సినిమా అన్నట్టుకాకుండా వైఎస్సార్ తో ప్రేక్షకులను కూడా కలుపుకొని అయనతో పాటుగా అడుగులు వేయిస్తూ వడివడిగా నడిపించేదిగా ఉంది. ఆలస్యం ఎందుకు.. మీరూ చూడండి.
Full View