సినిమా తారలు రాజకీయంలోకి వచ్చి సీఎంలు అయిన వారు ఎందరో ఉన్నారు.. సినీ తారలను ప్రజలు పిచ్చిగా ప్రేమించి ఆదరించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లాంటి వారు సినిమాల్లో, రాజకీయాల్లో రాణించారు. రాజకీయాలు, సినిమాలు రెండూ ప్రజలను విపరీతంగా ప్రభావితం చేసే రంగాలు. ఈ రెండింటికి ప్రజల విశేషమైన ఆదరణ కావాలి.. ఇక ఈ రెండు రంగాల మధ్య ఉన్న సన్నని గీత కూడా చెరిగిపోయింది.
రాజకీయాల్లోకి వెళ్లిన వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తాజాగా సినిమాల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఆయన ముఖానికి రంగం వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదివరకే సత్యనారాయణ టాలీవుడ్ లో కొన్ని సినిమాలు తీసిన నిర్మాతగా అనుభవం ఉంది. ఇప్పుడు రాజకీయ బిజీలో కాస్త సినిమాలకు విరామం ఇచ్చారు. అయితే ఆయనలోని కళాకారుడు కూడా తాజాగా బయటకు వచ్చాడు.
విశాఖలో పుట్టి మన్నెం దొరగా పేరు గడించి తెల్లదొరలను ఎదురించిన అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర మీద ఈ వైసీపీ ఎంపీ సినిమా తీస్తున్నారు. విశాఖకు చెందిన వారే ఈ సినిమా నిర్మిస్తున్నారు.
సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించడానికి విశాఖ ఎంపీ ఓకే చెప్పాడట.. అల్లూరి మీద సినిమా కావడం.. పైగా దేశభక్తి సినిమా కావడంతో ఈ వైసీపీ ఎంపీ ఏకంగా నటించడానికి అంగీకరించడం విశేషం. త్వరలోనే ఈసినిమా షూటింగ్ లో ఎంపీ పాల్గొంటారు.ఇలా రాజకీయాల నుంచి నటనలోకి వైసీపీ ఎంపీ ప్రవేశిస్తున్నారు.