అవును లీడ్ రోల్స్ కి ఎందుకు ఆడిష‌న్స్ వుండ‌వు?

Update: 2022-12-23 05:58 GMT
టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వార‌సుల‌దే హావా అన్న‌ది తెలిసిందే. ఇండ‌స్ట్రీల్లో వున్ననెపోజిమ్ (బంధుప్రీత‌)పై గ‌త కొంత కాలంగా వ‌రుస క‌థ‌నాలు, కామెంట్ లు.. ఆ స‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. దీనిపై 'అల వైకుంఠ‌పురుములో' మూవీ రిలీజ్ టైమ్ లో స్టార్ అల్లు అర్జున్ ఓపెన్ అయిపోయాడు. బంధుప్రీతి కి ఇక్క‌డ అంతా బ్రాండ్ అబాంసిడ‌ర్లే అంటూ పేర్కొన్నాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బంధుప్రీతిపై అల్లు అర్జున్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది.

ఆ త‌రువాత కొన్నేళ్లు అంటే రీసెంట్ గా ఇండ‌స్ట్రీలో వున్న నెపోటిజ‌మ్ పై స్టార్ హీరో అల్లు అర్జున్ ఫాద‌ర్‌, స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ కూడా స్పందించారు. రీసెంట్ గా అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బీకె సీజ‌న్ 2లో బాల‌కృష్ణ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా నెపోటిజ‌మ్ పై స్పందించారు. ఇలా చెబుతున్నందుకు త‌న‌ని ట్రోల్ చేస్తార‌ని తెలుస‌ని, అయినా స‌రే చెబుతాన‌ని వెల్ల‌డించారు. అయితే ట్రోల్ చేసే ముందు మీ కుటుంబం ఇండ‌స్ట్రీలో వుంటే మీకు అవ‌కాశం ఉండి కూడా వార‌సుల్ని ప‌రిచ‌యం చేకుండా ఇది నెపోటిజం అని ప‌క్క‌కు వెళ్లిపోతాం అని గుండెల మీద చేయి వేసుకుని నా గురించి ట్రోల్ చేయండి అని స్టేట్ మెంట్ ఇచ్చారు.

అయితే ఇండ‌స్ట్రీలో వున్న బంధు ప్రీతి కార‌ణంగానే చాలా మంది ఇక్క‌డ ఎద‌గ‌డం లేద‌న్న‌ది ఇత‌రుల వాద‌న. ఇదిలా వుంటే ఇండ‌స్ట్రీలో వున్న మ‌రో సంప్ర‌దాయంపై రీసెంట్ గా యంగ్ హీరో అడివి శేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. అవి ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి, ప్ర‌తీ సినీ ఫ్యామిలీ 10 మంది హీరోల‌ని క‌లిగి వుంది. ఇంత మంది హీరోలున్నా ప్ర‌ధాన లీడ్ రోల్ కోసం మాత్రం ఇంత వ‌ర‌కు ఆడిష‌న్స్ చేసే సంప్ర‌దాయం ఇక్క‌డ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మిగ‌తా పాత్ర‌ల కోసం ఆడిష‌న్స్ నిర్వ‌హించే వారు లీడ్ రోల్స్ కోసం మాత్రం ఆడిష‌న్స్ ఇక్క‌డ నిర్వ‌హించ‌డాసిని సాహ‌సించ‌డం లేదు.

సాధార‌ణంగా ప్ర‌తీ సారి లీడ్ రోల్ ఇక్క‌డ ముందే బుక్ అయిపోతూ వుంటుంది' అంటూ వెల్ల‌డించ‌డం చ‌ర్చినీయాంశంగా మారింది. య‌స్ ఈ విష‌యంలో శేష్ చెప్పింది అక్ష‌రాలా నిజ‌మే. ఎందుకంటే మ‌న సినిమాల‌న్నీ హీరో సెంట్రిక్ నేప‌థ్యంలో వుంటాయి. ఇక్కడ హీరో డేట్స్ దొరికితే చాలు ఆ త‌రువాత క‌థ మొత్తం న‌డుస్తూ వుంటుంది. కాంబినేష‌న్ ల‌ని సెట్ చేయ‌డం సినిమాలు చేయ‌డం ఇక్క‌డ జ‌రుగుతోంది అదే. నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు కూడా ఇదే ఫార్ములాని గ‌త కొన్నేళ్లుగా ఫాలో అవుతూ వ‌స్తున్నారు.

స్టార్ హీరో డేట్స్ దొరికితే చాలు అని ప్రొడ్యూస‌ర్‌.. స్టార్ హీరో క‌థ ఓకే చేస్తే చాల‌ని డైరెక్ట‌ర్ ఇలా లెక్క‌లు వేసుకుంటూ సినిమాలు చేస్తున్నారే కానీ తాము అనుకున్న క‌థ‌కు హీరో కావాల‌ని, అత‌నితో సినిమా చేస్తాన‌ని ఒక్క‌రిద్ద‌రు మాత్రమే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మిగ‌తావారంతా కాంబినేష‌న్ ల కోసం ప‌రుగులు పెడుతున్నారే త‌ప్ప మంచి సినిమాలు చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు. ఆ సంప్ర‌దాయానికి ఎప్పుడో నీళ్లొదిలేశారు. ఆ కారణంగానే లీడ్ రోల్స్ కి టాలీవుడ్ లో ఆడిష‌న్ సంస్కృతి క‌నిపించ‌కుండా పోయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News