'కింగ్' అక్కినేని నాగార్జున నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ''వైల్డ్ డాగ్''. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీ డీల్ ని బ్రేక్ చేసి మరీ థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అయింది. వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ - ట్రైలర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. అలానే ఇటీవల సెన్సార్ కు వెళ్లిన ఈ చిత్రానికి 'U/A' సర్టిఫికేట్ జారీ చేస్తూ.. ఇదొక మంచి సందేశాత్మక చిత్రమని కితాబిచ్చినట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో 'వైల్డ్ డాగ్' మేకర్స్ ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులకు స్పెషల్ షో చూపించి ఫీడ్ బ్యాక్ తెలుసుకున్నారు. ఈ సినిమా చూసిన వారిలో వర్ధమాన దర్శకులు సంకల్ప్ రెడ్డి - రవికాంత్ పేరేపు - స్వరూప్ ఆర్ఎస్జె తమ అభిప్రాయాలను వెల్లడించారు.
'ఘాజీ' 'అంతరిక్షం' చిత్రాల దర్శకుడు సంకల్ప్ రెడ్డి.. 'వైల్డ్ డాగ్' సినిమా చూశానని.. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని.. తెలుగు సినిమాని ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేస్తుందని పేర్కొన్నాడు. 'వైల్డ్ డాగ్' చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేశానని.. చూస్తున్నంత సేపు కళ్ళు తిప్పుకోలేదని.. నాగార్జున సార్ లోని మరో సైడ్ ని చూస్తారని 'క్షణం' ఫేమ్ రవికాంత్ తెలిపారు. ఈ సినిమా సిన్సియర్ డెడికేషన్ తో చేసినదని.. సీట్ ఎడ్జ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో చేసిన ఔట్ ఆఫ్ ది స్క్రిప్ట్ ఇదని 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' డైరెక్టర్ స్వరూప్ అన్నారు.
ఇదిలావుండగా నాగార్జున 'వైల్డ్ డాగ్' సినిమాని డిఫరెంట్ పబ్లిసిటీ స్ట్రాటజీలతో ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే నాగార్జున వరుస పెట్టి ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల చేసిన బేస్ క్యాంప్ ఈవెంట్ కూడా సక్సెస్ అయింది. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో మరో మూడు రోజుల్లో తెలిసిపోనుంది. ఇక 'వైల్డ్ డాగ్' కథ విషయానికొస్తే.. హైదరాబాద్ లో గతంలో జరిగిన టెర్రరిస్ట్ దాడుల ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కింది. అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి నిర్మించారు.