కొత్త డైరెక్టర్లు కుమ్మేస్తున్నారుగా..

Update: 2018-02-18 09:44 GMT
ఫిబ్రవరి నెల కేరాఫ్ డెబ్యూ డైరెక్టర్స్ అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఈ నెలలో కొత్త దర్శకుల హవా సాగుతోంది. తొలి వారాంతంలో ‘ఛలో’తో వెంకీ కుడుముల మంచి విజయాన్నందుకున్నాడు. ఈ సినిమా నాగశౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలరించే కామెడీ ఎంటర్టైనర్ తీసిన వెంకీకి వెంటనే బాగానే అవకాశాలు కూడా అందుతున్నట్లు సమాచారం. ఇక రెండో వీకెండ్లో ‘తొలి ప్రేమ’తో వెంకీ అట్లూరి సత్తా చాటుకున్నాడు. ఫీల్ ఉన్న లవ్ స్టోరీ తీసి రచయితగా.. దర్శకుడిగా మంచి పేరు సంపాదించాడు ఈ వెంకీ. ఆల్రెడీ రెండు మూడు కమిట్మెంట్లు కూడా ఇచ్చేశాడతను. ఇక ఈ వారాంతంలో ‘అ!’ సినిమాతో ప్రశాంత్ వర్మ కూడా తన టాలెంట్ చూపించాడు.

‘అ!’ సినిమా విడుదలకు ముందే ప్రశాంత్ పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ప్రోమోలతోనే అతడి టాలెంట్ ఏంటో అందరికీ అర్థమైంది. ఇప్పుడు సినిమా మీద కూడా బాగానే చర్చ జరుగుతోంది. సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ ప్రశాంత్ విభిన్నమైన కథతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన మాట వాస్తవం. అతడి ఫ్యూచర్ ప్రాజెక్టులపై జనాలకు మంచి అంచనాలే ఉన్నాయి. అతను కూడా ఆల్రెడీ తన తర్వాతి సినిమాకు కమిట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఐతే ఈ నెలలో ఇద్దరు కొత్త దర్శకులు మాత్రం నిరాశ పరిచారు. వాళ్లే.. విక్రమ్ సిరికొండ.. మంజుల ఘట్టమనేని. వీళ్లు తీసిన ‘టచ్ చేసి చూడు’.. ‘మనసుకు నచ్చింది’ సినిమాలకు చేదు అనుభవం ఎదురైంది. ఇక ఈ నెలలోనే వస్తుందని భావిస్తున్న ‘కిరాక్ పార్టీ’తో దర్శకుడిగా పరిచయం కానున్నాడు శరణ్ కొప్పిశెట్టి. మరి అతడెలాంటి ఫలితాన్నందుకుంటాడో చూడాలి. ఒక నెలలో దాదాపు ఆరుగురు కొత్త దర్శకులు పరిచయం కావడం.. అందులో కనీసం ముగ్గురు ప్రామిసింగ్ అనిపిస్తుండటం మాత్రం ప్రత్యేకమైన విషయమే.
Tags:    

Similar News