కుర్రకారు.. తగ్గిందా హుషారు

Update: 2016-07-12 22:30 GMT
ఏదో సాధించాలని ఎన్నో కలలు కానీ సినిమా రంగంలోకి అడుగుపెట్టే దర్శకుల జాబితాకి కొదవ లేదు. ఎప్పటికప్పుడు ట్రెండ్ ని మారుస్తూ, కొత్తగా ఆలోచిస్తూ స్క్రిప్ట్ లను మంచి నటీనటుల ఎంపికతో వెండితెరపై ఇటీవల మంచి సినిమాలే వచ్చాయి. అయితే తొలిసినిమాలో వుండే ఫైర్ రెండో సినిమాలో చూపించాలన్న తపనతోనో, లేక ఇతరాతర కారణాలతోనో రెండో ప్రాజెక్టు పట్టాలెక్కడానికి కాస్త సమయం పడుతుంది.

ఉయ్యాల జంపాల అనంతరం విరించి వర్మ - ఊహలు గుసగుసలాడే అనంతరం అవసరాల శ్రీనివాస్ సుదీర్ఘ విరామం తీసుకుని ఇప్పుడు రెండో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక రౌడీ ఫెలో తో మెప్పించిన కృష్ణచైతన్య, ఎవడే సుబ్రమణ్యం తెరకెక్కించిన నాగ అశ్విన్ ఇంకా తమ సెకండ్ వెంచర్ స్టార్ట్ చెయ్యాల్సిఉంది.

ఇక స్క్రిప్ట్ పనులు పూర్తయ్యి హీరోలకోసం తమ రెండవ సినిమాను వాయిదా వేస్తున్న దర్శకులది మరొక తంతు. ప్రభాస్ కోసం సుజిత్, నాగార్జున, నాగ చైతన్యల కోసం సోగ్గాడే చిన్ని నాయన తీసిన కళ్యాణ్ కృష్ణ బౌండెడ్ స్క్రిప్ట్ తో వెయిట్ చేస్తున్నారు. ఇంకా క్షణం తెరకెక్కించిన రవికాంత్, నేను శైలజ తీసిన కిషోర్, భలే మంచి రోజుని చూపించిన శ్రీరామ్ తమ తదుపరి చిత్రాల వివరాలు ప్రకటించాల్సిఉంది. మరి వీరంతా ద్వితీయ విఘ్నాన్ని దాటి టాలీవుడ్ లో వెల్ ఎష్టాబ్లిష్ కావాలని కోరుకుందాం. 
Tags:    

Similar News