చాలా లేట్ చేస్తున్న కొత్త బ్యాచ్

Update: 2017-08-28 04:11 GMT
టాలీవుడ్ లోకి కొత్త జెనరేషన్ దర్శకులు ఎంట్రీ ఇచ్చారు. వినాయక్ - రాజమౌళి - శ్రీనువైట్ల తదితరులు ఓల్డ్ బ్యాచ్ లోకి వెళ్లిపోయారు. అయితే పాత బ్యాచ్ లో ఉన్న దర్శకులు తమ మందు తరం వారి కంటే కాస్త స్టడీగానే సినిమాలు తీసినా, ఒక్కొకరు ఏడాదికి రెండు సినిమాలైనా తీసేవారు. కానీ నేటి తరం యువ దర్శకులు మాత్రం ఒక్క సినిమా తరువాత మరో సినిమా రావడానికి రెండేళ్లు పైనే పడుతుంది. కొత్త తరం దర్శకుల్లో సుధీర్ వర్మ - చందుమొండేటి - సుజిత్ - శ్రీరామ్ ఆదిత్య - తరుణ్ భాస్కర్ తదితరులకి ప్రేక్షకాధరణ ఉంది.

వీరితో సినిమాలు తీసేందుకు నిర్మాతలు మక్కువ చూపుతున్నారు కానీ ఈ బ్యాచ్ మాత్రం ఒక సినిమా నుంచి మరో సినిమాకి షిఫ్ట్ అవ్వడానికి రెండేళ్లు గ్యాప్ తీసుకుంటున్నారు. సుధీర్ వర్మ ఇండస్ట్రీలోకి వచ్చి అయిదేళ్లు అవుతుంది. ఈ అయిదేళ్లతో సుధీర్ వర్మ కేవలం మూడు సినిమాలు మాత్రమే తెరకెక్కించాడు, అందులో రెండు సినిమాలు తన సన్నిహితుడు నిఖిల్ తోనే తీశాడు. ఇక చందుమొండేటి కూడా ఇదే తీరున ఉన్నాడు, నాలుగేళ్లలో రెండు సినిమాలు మాత్రమే చందుమొండేటి నుంచి వచ్చాయి. ఇక శమంతకమణితో మొన్ననే ఓ మల్టీస్టారర్ తీసిన శ్రీరామ్ ఆదిత్య - మళ్లీ సినిమా చేయడానికి ఓ రెండేళ్లు పట్టేలా ఉందని తెలిసింది. అలానే పెళ్లి చూపులు సినిమాతో అవార్డులు అందుకున్న తరుణ్ భాస్కర్ రెండో ప్రాజెక్ట్ గురించి ఇంతవరకు ఎలాంటి న్యూస్ బయటకి రాలేదు. సుజిత్ అయితే ప్రభాస్ తో సాహో చేస్తున్నాడు కానీ అతని మొదటి సినిమాకి సాహోకి మూడేళ్లు గ్యాప్ ఉంది. సినిమా సినిమాకి ఇంత ల్యాంగ్ గ్యాప్ తీసుకుంటున్న ఈ కొత్త దర్శకులు తమ కెరీర్ ముగిసే లోపు పది సినిమాలైనా చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  వీరి ముందు బ్యాచ్ లో ఉన్న సుకుమార్, కొరటాలశివ, త్రివిక్రమ్ తదితరలు కూడా ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నారు. టాలీవుడ్ లో దర్శకులు కొరత ఏర్పడిందని, పెట్టుబడి పెట్టే నిర్మాతలున్నా, వినూత్నమైన కథలు ఉన్నా వాటిని తెరకెక్కించే దర్శకులు లేరనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ కామెంట్స్ మరీ ముదరక ముందే ఈ యువ దర్శకులు కాస్త స్పీడూ పెంచుతారేమో చూడాలి.
Tags:    

Similar News