ఫారిన్ పిల్లతో డేటింగ్ సెట్టయ్యిందటగా..

Update: 2018-03-08 14:44 GMT
వారసత్వంతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆ కుర్రాడు మాంచి జోరు మీదే ఉండేవాడు. ఈ మధ్యన వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు కానీ.. మంచి సినిమా పడిందంటే మళ్లీ ఫామ్ లోకి రావడం ఈ కుర్రాడికి పెద్ద కష్టమేమీ కాదు. యంగ్ హీరోల్లో బెంచ్ మార్కులు మొదటగా సెట్ చేసింది కూడా ఇతడే.

ఈ యంగ్ హీరో ప్రస్తుతం ఓ భామతో డేటింగ్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈమె ఇక్కడి సుందరాంగి కాదు.. ఓ విదేశీ పాప. గతంలో ఈమెతో కలిసి ఓ సినిమా చేసిన ఈ హీరో.. అప్పట్లోనే ఆమెతో డేటింగు గట్రా చేసేందుకు బాగా ట్రై చేశాడట. కానీ ఆ సమయంలో డేటింగ్ కి నో చెప్పిన ఈ పాప.. ఇప్పుడు సరే అనేసిందట. ప్రస్తుతం ఇతను సినిమా షూటింగ్ చేస్తున్న స్పాట్ కు రెగ్యులర్ గా వచ్చేస్తోందట. ఇద్దరూ రోజువారీగా తెగ చక్కర్లు కొట్టేస్తున్నారని.. ఇండస్ట్రీ జనాలు తెగ చెప్పేసుకుంటున్నారు. ఫారిన్ పాపతో ఈ యంగ్ హీరో డేటింగ్.. ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది.

ఈ కుర్రాడిని చాలామంది యంగ్ హీరోయిన్లతోనే లింకులు కట్టి వార్తలు వచ్చాయి. కానీ వాటన్నిటినీ నవ్వుతోనే ఖండించిన ఈ కుర్రాడు.. ఈ ఫారిన్ అమ్మాయి విషయంలో ఇంత సీరియస్ గా ప్రొసీడ్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఈ ఫారిన్ పాపతో డేటింగ్ ఎంత వరకూ చేరుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News