కెరీర్ ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ నుంచి మీడియం రేంజ్ హీరో స్థాయికి లాక్కోచ్చిన ఓ హీరో ఇప్పుడు నిర్మాతల్ని ముప్పుతిప్పలు పెడుతున్నాడని ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఓ హాట్ న్యూస్ షికార్లు కొడుతుంది. గత అయిదేళ్లుగా కెరీర్ ని ఓ గాఢిలో పెట్టిన ఆ హీరోకి ప్రస్తుతం కొన్ని ఏరియాల్లో మార్కెట్ బాగానే ఉండంటంతో కొందరు నూతన నిర్మాతలు అతడితో సినిమాలు తీసేందుకు మక్కువ చూపుతున్నారు. కొన్ని పెద్ద బ్యానర్లు కూడా ఆ హీరోతో సినిమాలు తీసినా - వారి దగ్గర నోరు మెదపకుండా సైలెంట్ గా సినిమాలు చేస్తున్న ఆ హీరోగారు కొత్త నిర్మాతల్ని మాత్రం విసిగిస్తున్నాడని సమాచారం. బ్యానర్ కి ఉన్న బ్రాండ్ నేమ్ తో ఈ ఏడాది ఓ బ్లాక్ బస్టర్ కొట్టిన ఆ హీరో తాను నలభై కోట్ల హీరో అయిపోయానంటూ కొత్త నిర్మాతల దగ్గర స్టేట్ మెంట్లు ఇవ్వడం అంతటితో ఆగకుండా సినిమా బడ్జెట్ ని నలభై కోట్లకి తగ్గకుండా చూసుకోవాల్సిందిగా ఒత్తిడి చేయడం ఆ హీరోగారు మొదలుపెట్టినట్లుగా విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఓ క్రేజీ దర్శకుడుతో సినిమా చేస్తున్న ఆ హీరో ఆ తరువాత ఓ పెద్ద బ్యానర్ లో వర్క్ చేసేందుకు ఒప్పకున్నాడు. అయితే పేరుకు పెద్ద బ్యానర్ అయినా, ఇండస్ట్రీకి కొత్త కావడంతో ఆ హీరోగారి కోరికలకు తలొగ్గి సినిమాను మార్కెట్ రేటు కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి నిర్మించేందుకు ఒప్పుకున్నట్లుగా సమాచారం. రెండేళ్లకు ఓసారి సినిమా తీస్తున్న ఓ యంగ్ దర్శకుడు ఆ ఓవర్ బడ్జెట్ మూవీని హ్యాండిల్ చేస్తున్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదంతా ఈ ఏడాది ఆరంభంలో ఆ హీరోగారికి వచ్చిన బ్లాక్ బస్టర్ మూలంగానే జరుగుతుందనే టాక్ ఉంది. అయితే మరోవైపున ఆ బ్లాక్ బస్టర్ తరువాత వచ్చిన ఆ హీరోగారి సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందనే విషయం గమినించాల్ని ఉందనే వారు లేకపోలేదు. ఏదైతేనేం ఆ హీరోగారి స్టార్ ప్రస్తుతం నడుస్తుంది గనుకే గోల పెడుతూనే ఓవర్ బడ్జెట్ పెట్టేందుకు కొత్త నిర్మాతలు రెడీ అవుతున్నారని సినీ జనాలు అంటున్నారు. కానీ స్టార్ అన్ని రోజులు వెలగదు అనే విషయాన్ని ఆ హీరోగారు గమినిస్తే కెరీర్ లో ఇంకాస్త ముందుకు వెళ్లే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో