డిజిటల్ ప్రపంచంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రచ్చ మొదలైంది. అందరూ ఈ ఓటీటీలలో వచ్చే వెబ్ కంటెంట్ చూడటానికే ఇష్టపడుతున్నారు. ఇదివరకు ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఆరాలు తీసేవారు. కానీ ఇప్పుడు ఏ సినిమా ఏ వెబ్ సిరీస్ ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలవుతుందో అని ఆరాలు మొదలవుతున్నాయి. ప్రస్తుతం మనకి ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎక్కువగానే అందుబాటులో ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ ఇంకా ఎన్నో ఓటిటి యాప్స్ మన తెలుగులో కూడా సక్సెస్ అయ్యాయి. కరోనా లాక్ డౌన్ పుణ్యమా అంటూ ఇంకా ఓటీటీలకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ సమయంలో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ బాగా పుంజుకొని సబ్స్క్రైబర్స్ పెంచుకుంటూ పోతున్నారు. ఇంటికే పరిమితమైన జనాలు ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ సినిమాలను వెబ్ సిరీసులను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. కంటెంట్ ఎలా ఉన్నా కూడా ఫ్యామిలీస్ అందరూ ఒకే దగ్గర సరదాగా గడుపుతూ ఈ వెబ్ సిరీస్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తుండటంతో స్టార్స్ అంతా ఇప్ప్పుడు వెబ్ సిరీస్ లపై దృష్టి పెడుతున్నారు. రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ దే రాజ్యం కాబోతుందని భావిస్తున్న దర్శక నిర్మాతలు ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు. సినిమాలకు మించిన బడ్జెట్లు పెట్టడానికి ఓటీటీ సంస్థలు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే మన టాలీవుడ్ నుండి హీరో హీరోయిన్స్ డైరెక్టర్లు వెబ్ సిరీస్ వైపు అడుగులు వేశారు.
టాలీవుడ్ లో కూడా శ్రీకాంత్, సందీప్ కిషన్, నవదీప్, మంచు లక్ష్మీ, హెబ్బా పటేల్, ఇషా రెబ్బా లాంటి వారు ఇప్పటికే వెబ్ సిరీస్ లలో దర్శనమిచ్చారు. సమంత, ప్రియమణి లాంటి స్టార్ హీరోయిన్స్ హిందీ వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే క్రిష్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ లాంటి డైరెక్టర్లు వెబ్ సిరీస్ లలో అడుగుపెట్టారు. శరత్ మరార్, స్వప్న దత్ లాంటి బడా నిర్మాతలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. ఇప్పుడు తాజాగా హీరో విజయ్ దేవరకొండ కూడా వెబ్ సీరీస్ వైపు అడుగులు వేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అల్లు అరవింద్ క్రియేట్ చేసిన ఓటీటీ 'ఆహా'కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విజయ్ దేవరకొండ 'ఆహా' కోసం వెబ్ సిరీస్ లను నిర్మించడంలో భాగస్వామ్యం అవుతున్నాడట. విజయ్ దేవరకొండ నిర్మాణ సంస్థ 'కింగ్ ఆప్ ది హిల్స్ ఎంటర్టైన్మెంట్స్' తరపున కొన్ని వెబ్ సిరీస్ లను ప్లాన్ చేస్తున్నాడట. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ ఉంటుందని తెలుస్తుంది. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఇంట్రడ్యూస్ అయిన 'దొరసాని' సినిమాకి మహేంద్ర దర్శకత్వం వహించారు. మొత్తం మీద టాలీవుడ్ ప్రముఖులందరూ డిజిటల్ వరల్డ్ లో కాలు పెట్టడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు కూడా వెబ్ సిరీస్ లని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.