కిర‌ణ్ అబ్బ‌వ‌రం చేతిలో ఇన్ని ప్రాజెక్ట్ లా?

Update: 2022-11-25 02:30 GMT
క‌రోనా కార‌ణంగా ఓటీటీల ప్ర‌భావం బాగా పెరిగింది. థియేట‌ర్ల‌లో కంటెంట్ వున్న సినిమాల‌కే ప్రేక్ష‌కులు ప‌ట్టం క‌డుతున్నారు. అయినా స‌రే గ‌తంతో పోలిస్తే క‌రోనా త‌రువాతే రికార్డు స్థాయిలో సినిమాలు.. వెబ్ సిరీస్ ల నిర్మాణం జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం వ‌ర‌కు ఏ హీరో కూడా ప్ర‌స్తుతం ఖాలీగా లేడు. అప్ క‌మింగ్ హీరోలు కూడా రెండు మూడు సినిమాల‌తో బిజీగా వున్నారంటే ప‌రిస్థితి ఎంత‌గా మారిపోయిందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఒక విధంగా చెప్పాలంటే మేక‌ర్స్ కిది గోల్డెన్ టైమ్ గా మారింది. టాలెంట్, ప్రేక్ష‌కుల‌ని మెప్పించ‌గ‌ల స్టోరీ.. ఆ స్టోరీని తెర‌పైకి తీసుకురాగ‌ల నిర్మాత ల‌భిస్తే సినిమా ప‌ట్టాలెక్కేస్తోంది. గ‌తంలో సినిమాలు చేయ‌లేక‌పోయిన వాళ్లు కూడా ఇప్ప‌డు తాము అనుకున్న చిన్న పాయింట్ తో కూడా సినిమా చేసేస్తున్నారు. దీంతో ప్ర‌తీ ఒక్క‌రూ బిజి బిజీగా మారిపోయారు. ఈ క్ర‌మంలో యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ల‌తో ఫుల్ బిజీ అని తెలుస్తోంది.

`రాజావారు రాణిగారు` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఈ మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ త‌రువాత చేసిన `ఎస్. ఆర్‌. క‌ల్యాణ మండ‌పం` మంచి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డ‌మే కాకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ ప‌రంగానూ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచింది. దీంతో కిర‌ణ్ అబ్బ‌వ‌రం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. అయితే ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో న‌టించిన `సెబాస్టియ‌న్ 524` మాత్రం ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది.

అయినా కిర‌ణ్ అబ్బ‌వ‌రంకు ఆఫ‌ర్ల‌కు కొద‌వ‌లేదు. త‌ను రీసెంట్ గా న‌టించిన `స‌మ్మ‌త‌మే` ఫ‌రావాలేద‌నిపించింది. ఇక సెప్టెంబ‌ర్ లో విడుద‌లైన `నేను మీకు బాగా కావాల్సిన వాడిని` డిజాస్ట‌ర్ అనిపించుకుంది. ప్ర‌స్తుతం గీతా ఆర్ట్స్ 2లో `విన‌రో భాగ్య‌ము విష్ణ‌క‌థ‌` చేస్తున్నాడు.

అలాగే మైత్రీ వారు స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న `మీట‌ర్‌`, ఏ.ఎం. ర‌త్నం స‌మ‌ర్ప‌ణ‌లో `రూల్స్ రంజ‌న్‌`తో పాటు ఏషియ‌న్ ఫిలింస్ వారు నిర్మిస్తున్న సినిమాలోనూ న‌టిస్తున్నాడు. వీటితో పాటు మ‌రో రెండు పెద్ద సినిమాల‌ని కూడా కిర‌ణ్ అబ్బ‌వ‌రం లైన్ లో పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ హీరో లా టాలీవుడ్ లో ఏ హీరో ఇన్ని ప్రాజెక్ట్ ల లైన‌ప్ తో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News