టాలీవుడ్ లో ఈమద్య కాలంలో మల్టీస్టారర్ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. యువ హీరోలు పలువురు మల్టీస్టారర్ చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు. కాని ఒక హీరో మాత్రం మల్టీస్టారర్ మూవీ అంటే బాబోయ్ నీకో దండం అంటున్నాడు. పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి - తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు దక్కించుకున్న ఆ హీరో ఈమద్య వరుసగా విజయాలను దక్కించుకున్నాడు. దాంత ఈయనకు మినిమం గ్యారెంటీ హీరో అంటూ పేరు పడిపోయింది. ఇలాంటి సమయంలో ఒక మల్టీస్టారర్ చిత్రం చేసి తీవ్రంగా నిరాశ పర్చాడు.
సోలో హీరోగా వరుసగా చిత్రాలు చేసి మంచి విజయాలు దక్కించుకున్న ఆ యువ హీరో సీనియర్ హీరోతో చేసిన మల్టీస్టారర్ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ మల్టీస్టారర్ చిత్రాల జోలికి వెళ్లవద్దని నిర్ణయించుకున్నాడట. ఆ విషయాన్ని సన్నిహితుల వద్ద చెబుతున్నాడు. తాజాగా ఒక దర్శకుడు మల్టీస్టారర్ స్క్రిప్ట్ ఆ హీరో వద్దకు వెళ్లిన సమయంలో నీకో దండం - నీ మల్టీస్టారర్ స్క్రిప్ట్ కు ఇంకో దండం అన్నాడట. ఒక మంచి కథను - సోలో హీరో ఉండే కథను తీసుకురా తప్పకుండా చేద్దాం - కాని మల్టీస్టారర్ చిత్రం అయితే చేయను అంటూ తేల్చి చెప్పాడట.
సోలో హీరోగా ఎన్నో సక్సెస్ లు అందుకున్న ఆ యువ హీరో మల్టీస్టారర్ చిత్రంతో ఫెయిల్ అయ్యింది. మొదటి నుండి తన పాత్ర పరిధి తగ్గిస్తున్నారు అంటూ ఆ యువ హీరో మొత్తుకున్నాడట. కాని ఆ సీనియర్ హీరో ఒత్తిడితో ఆయన పాత్ర పరిధి పెంచడంతో కథ మొత్తం అడ్డదిడ్డంగా తయారు అయ్యి - సినిమా ఆకట్టుకోలేక పోయిందని ఆ యువ హీరో సన్నిహితుల వద్ద అంటున్నాడు. ఇద్దరు హీరోలు నటిస్తున్నప్పుడు స్క్రిప్ట్ లో రాసుకున్నట్లుగా సినిమా రాదు - అందుకే మల్టీస్టారర్ ఇకపై చేయను అంటూ ఆ హీరో తెగేసి చెబుతున్నాడు. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో ఆ యువ హీరో బిజీగా ఉన్నాడు.