టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిన రామ్.. ఉత్తరాదిలో కూడా ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. దీంతో రామ్ మార్కెట్ కూడా మరింత పెరిగింది. ఈ క్రమంలో రామ్ నటించిన 'రెడ్' సినిమాని 8 భాషల్లో తీసుకొస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రామ్ తొలిసారిగా డ్యూయల్ రోల్ పోషించాడు. ఇందులో మాళవిక శర్మ - అమృతా అయ్యర్ - నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న రామ్.. తాజాగా ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా 'అర్జున్ రెడ్డి' సినిమా స్క్రిప్ట్ మీ దగ్గరకు వస్తే చేసేవారా? అని రామ్ ని ప్రశ్నించగా.. ''బోల్డ్ సీన్స్ చేయడం కష్టమేమీ కాదని.. అవి కొత్త ఆర్ట్ ఫార్మ్ ఏమీ కాదని.. క్యారక్టర్ డిమాండ్ చేస్తే చేస్తానని.. అప్పుడు సందీప్ వచ్చి నేను ఎక్సయిట్ అయ్యే అంశాలతో కథ చెప్పి ఉంటే చేసేవాడినేమో'' అని రామ్ చెప్పుకొచ్చారు. ఇక కొత్త డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అని తేడా ఏమీ లేదని స్క్రిప్ట్ ని బట్టి ఉంటుందని తెలిపారు. పాన్ ఇండియా మార్కెట్ విషయంపై మాట్లాడుతూ.. ''పాన్ ఇండియా లెవెల్ లో సినిమా పేర్లు పెట్టడం కాదు.. స్టోరీ కూడా కనెక్ట్ కావాలి. కెమిస్ట్రీ వర్కౌట్ కావాలి. ఇప్పటివరకు అలాంటిది ఏమి ప్లాన్ చేయలేదు. కానీ 'రెడ్' కూడా మల్టిఫుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతోంది'' అన్నాడు.