గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు - అక్కినేని నాగార్జున దంపతులతో పాటు పలువురు సెలబ్రిటీలు పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేశారు. సినీ ప్రముఖులు అందరూ ఓటు వేసిన అనంతరం చేతి వేలికి ఉన్న సిరాను చూపిస్తూ ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఓటేయడం అందరి బాధ్యత అని తెలుపుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది యువ హీరోలు కూడా ఓటు వేసి ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే దీనికి కూడా పబ్లిసిటీ చేసుకుంటూ సదరు హీరోల టీమ్ మెంబర్స్ చేసిన హడావిడిపై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
చిరంజీవి - నాగార్జున వంటి స్టార్ హీరోలు ఓటు వేస్తే దాన్ని మీడియా ప్రమోట్ చేసినా ఓ అందం. మరీ నిన్న మొన్న వచ్చిన కుర్ర హీరోలు ఓటు వేసినా మీడియా ఎటెన్షన్ కోసం వారి టీమ్ మెంబర్స్ చేస్తున్న హడావుడి కాస్త ఎక్కువైనట్లుగా అనిపిస్తోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. వీరంతా మీడియా అటెన్షన్ కోసం కాకుండా సరైన సినిమాలు చేసి సక్సెస్ అయితే స్టార్లు అవుతారు.. అలా కాకుండా మేము ఆల్రేడీ స్టార్స్ అయిపోయాము అనుకుంటే మొదటికే మోసం వస్తుందని.. సినిమా కెరీర్ మున్నాళ్ల ముచ్చట అవుతుందని నెటిజన్స్ సదరు హీరోలను ఉద్దేశించిన కామెంట్స్ చేస్తున్నారు.